కౌంటింగ్ కేంద్రాలు ఇవే..

కౌంటింగ్ కేంద్రాలు ఇవే..
x
Highlights

డిసెంబర్‌ 11న జరిగే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. అందుకోసం అన్ని జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ...

డిసెంబర్‌ 11న జరిగే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. అందుకోసం అన్ని జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

నిజామాబాద్‌: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు.

ఆసిఫాబాద్‌ జిల్లా : ఆసిఫాబాద్‌ పట్టణంలోని సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కాలేజీ , ఇక్కడ రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.

కామారెడ్డి : కామారెడ్డి ఏఎంసి గోదాంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

మంచిర్యాల : ఏఎంసీ గోదాంలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు.

ఆదిలాబాద్‌ : టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.

నిర్మల్‌కు : నిర్మల్‌ పట్టణంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.

జగిత్యాల : పట్టణంలోని వీఆర్కే ఎడ్యుకేషన్ సొసైటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.

పెద్దపల్లి : మంథని జేఎన్‌టీయూహెచ్‌లో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ కూడా మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

కరీంనగర్‌ : ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.

సిరిసిల్ల : తంగళ్లపల్లి సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌లో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

సంగారెడ్డి : గీతం యూనివర్సిటీలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

మెదక్‌ : వైపీఆర్‌ కాలేజీ ఎడ్యుకేషన్‌లో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు.ఇక్కడ రెండు నియోజర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

సిద్దిపేట : ఇందూరు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

రంగారెడ్డి : పాలమూకులలోని బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. అలాగే ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షిల్‌ డిగ్రీ కాలేజీలో మరో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ మొత్తం 8 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

వికారాబాద్‌ : అగ్రికల్చర్‌ మార్కెట్‌ గోదాంలో కౌటింగ్ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.
జోగులంబా గద్వాల : గద్వాలలోని ఎస్‌కేటీఆర్‌ కాలేజీ ఓల్డ్ బిల్డింగ్‌లో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.

నల్గొండ : దుప్పల్లాపల్లి హౌసింగ్ వేర్ హౌస్ కార్పొరేషన్‌లో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. చేశారు. ఇక్కడ ఆరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

సూర్యాపేట : ఏఎంసీ గోదాంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.

యాదాద్రి : భువనగరిలోని అరోరా ఇంజనీరింగ్‌ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ రెండు నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు.

జనగామ : పెంబర్తి వీబీఐటీలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు.

మహబూబాబాద్‌ : ఫాతిమా హైస్కూల్‌లో కౌంటిగ్‌ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

వరంగల్-రూరల్‌ : నగరంలోని ఏనుమాముల ఏఎంసీ మార్కెట్‌ యార్డులో కౌంటింగ్‌ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

వరంగల్ అర్బన్‌ : ఎనుమాములలోని ఎంఎల్‌ఎస్‌ గోదాంలో మరో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ మొత్తం మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.

భూపాలపల్లి : అంబేడ్కర్‌ స్టేడియంలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ రెండు నియోజర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

కొత్తగూడెం : పాల్వంచలోని ఇనుబోసు ఇంజనీరింగ్‌ కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ మొత్తం ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఖమ్మం : విజయ ఇంజనీరింగ్‌ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ మొత్తం ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

మేడ్చల్ : కీసరలోని హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు.ఇక్కడ మొత్తం ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

హైదరాబాద్‌ : నగరంలో మొత్తం 13 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు. అంబర్‌పేటలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, నాంపల్లిలోని ఎల్బీ స్టేడియం, యూసుఫ్‌ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, తార్నాకలోని ఓయూ కామర్స్ బిల్డింగ్, నారాయణగూడలోని రెడ్డి కాలేజీ, మాసాబ్‌ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌, కమలా నెహ్రు పాలిటెక్నిక్ కళాశాల, బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ, గోషామహాల్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీ ఆడిటోరియం, నాంపల్లిలోని సరోజిని నాయుడు కాలేజీ, మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్య భవన్, ఓయూలోని పీజీఆర్‌ఆర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, కంటోన్మెంట్‌లోని సీఎస్‌ఐఐటీ వెస్లీ కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 15 నియోజర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

వనపర్తి : న్యూ అగ్రికల్చర్ మార్కెట్ బిల్డింగ్‌ కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఒక్క నియోజకవర్గం సంబంధించే ఓట్ల లెక్కింపు.

మహబూబ్ నగర్ : ధర్మపురిలోని జేపీ ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియంతో పాటు అదే కాలేజీలోని అబ్దుల్‌ కలాం బిల్డింగ్‌లో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు. ఇక్కడ ఐదు నియోజవకర్గాల ఓట్ల లెక్కింపు.

నాగర్ కర్నూల్‌ : నెల్లికొండలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు. ఇక్కడ మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.

Show Full Article
Print Article
Next Story
More Stories