తెలంగాణలో మామూళ్ల పోలీసులకు మంగళం

తెలంగాణలో మామూళ్ల పోలీసులకు మంగళం
x
Highlights

తెలంగాణాలో నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్న పోలీసులపై డీజీపీ కొరడా ఝులిపించారు. ఏకంగా స్పెషల్ పోలీసు టీమ్ వ్యవస్థను రద్దు చేశారు. వివిధ జిల్లాలో 391...

తెలంగాణాలో నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్న పోలీసులపై డీజీపీ కొరడా ఝులిపించారు. ఏకంగా స్పెషల్ పోలీసు టీమ్ వ్యవస్థను రద్దు చేశారు. వివిధ జిల్లాలో 391 మంది పోలీసు అవినీతిపారులు ఉన్నారనే లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది.

తెలంగాణ స్పెషల్ టీమ్ ల్లోని పలువురు అవినీతి పోలీసుల భరతం పట్టిన డీజీపీ మహేందర్ రెడ్డి... నెల నెలా మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 391 మంది పోలీసులపై బదిలీ వేటు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్క్యూలర్ ను తలపించే మెసెజ్ ఇది. అంతేకాదు అవినీతికి పాల్పడుతున్న ఎస్పైలు, పోలీసుల పేర్లు, వారి పని చేస్తున్న జిల్లాల లిస్ట్ కూడా ఉంది.

నేరాలను నియంత్రించటానికి యస్పీ,డీఎస్పీ,ఏసిపి,కమీషనర్లకు అనుంబంధంగా పోలీసు స్పెషల్ టీమ్ లు పని చేస్తాయి. సివిల్‌ డ్రెస్‌లో విధులు నిర్వహిస్తూ... నేరస్ధులను అరెస్ట్‌ చేయడం, ఆసాంఘిక శక్తులపై నిఘా ఉంచి వారి కదలికలను ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేయడం వీరి ప్రధాన డ్యూటీ. అయితే, కొంతమంది పోలీసు అధికారుల ప్రోత్సహంతో ప్రత్యేక బృందాల్లోని చాలామంది పోలీసులు తమ విధులను నిర్లక్ష్యం వహిస్తూ మామూళ్ల వసూళ్లు చేస్తున్నారని డీజీపీ పేరిట విడుదలైన మెసెజ్ లో ఉంది.

పోలీసు ప్రత్యేక బృందాల అవినీతిపై పోలీసు అధికారులతో గతంలోనే డీజీపీ విచారణ చేయించారు. సూర్యాపేట జిల్లాలో 40 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 35 మంది, కరీంనగర్ జిల్లాలో 34 మంది, నిజామాబాద్ జిల్లాలో 29 మంది, వికారాబాద్ జిల్లాలో 27 మంది పోలీసులు నెలసరి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు అధికారులు డీజీపీకి రిపోర్టు ఇచ్చినట్లు మెస్ జ్ లో ఉంది.

మామూళ్ల వసూళ్లకు తెగబడుతున్న స్పెషల్ టీమ్ లకు చెందిన మొత్తం 391 మంది ఎఎస్సైలు, పోలీసుల లిస్ట్ ఉంది. అవినీతికి పాల్పడుతున్న ఈ పోలీసులను వారి సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలని మెసెజ్ లో ఉంది. మళ్లీ అవినీతి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించినట్లు మెసెజ్ ఉంది. పోలీసు శాఖలో ఇంటర్నల్ గా పెట్టిన ఈ లిస్ట్ , ఈ మెసెజ్ కు బయటకు లీక్ అయిందా లేదా ఫేక్ అన్నది అంతుబట్టకుండా ఉంది. పోలీస్ శాఖలో మాత్రం ఇవి కలకలం రేపుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories