నాపేరు సూర్య.. హాలీవుడ్ కాపీనా?

నాపేరు సూర్య.. హాలీవుడ్ కాపీనా?
x
Highlights

టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాపీ అనే పదం బాగా వినిపిస్తోంది. పెద్ద దర్శకులు రచయితలే అలాంటి పొరపాట్లు చేస్తుండడంతో చిత్ర పరిశ్రమపై నెగిటివ్...

టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాపీ అనే పదం బాగా వినిపిస్తోంది. పెద్ద దర్శకులు రచయితలే అలాంటి పొరపాట్లు చేస్తుండడంతో చిత్ర పరిశ్రమపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఏడాది డ్రగ్స్ వివాదం ఎలా అయితే టాలీవుడ్ కు మచ్చ తెచ్చిందో ఇప్పుడు కాపీ అనే పదం కూడా విమర్శలకు బాస్ ఇస్తోంది. గత కొంత కాలంగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నా ఎక్కువగా హైలెట్ కాలేదు. కానీ ఎప్పుడైతే అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీ ఆధారంగా తెరకెక్కిందని వార్తలు వచ్చాయో అప్పటి నుంచి నెక్స్ట్ సినిమాలు కూడా అదే తరహాలో రాబోతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అల్లుఅర్జున్-అను ఇమ్మాన్యుయేల్ జంటగా టాలీవుడ్‌లో రానున్న మూవీ ‘నాపేరు సూర్య’. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ గురించి లేటెస్ట్ న్యూస్. ఈ చిత్రం.. హాలీవుడ్ కాపీయేనంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జోరందు కుంది. 2002లో వచ్చిన ‘యాంట్వోన్ ఫిషర్’ మూవీలో ఓ యువకుడు చిన్నతనంలోనే హింసాత్మకంగా మారుతాడు. ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో నేవీలో జాయిన్ అవుతాడు..తోటి ఉద్యోగులపైనే దాడి చేస్తాడు. చివరకు పైఅధికారి సలహా మేరకు ఆ యువకుడు సైకాలజిస్ట్‌ని సంప్రదిస్తాడు.

ఇక ‘నాపేరు సూర్య’ కూడా ‘యాంట్వోన్ ఫిషర్’కి దగ్గరగా వుందని అంటున్నారు. బన్నీ రోల్ కూడా సేమ్ అని, కాకపోతే ఆర్మీ‌మేన్‌గా హీరో కనిపిస్తాడని చెబుతున్నారు. మరి ఈ వార్తలపై యూనిట్ ఏమంటుందో చూడాలి. ఈ కామెంట్లను బన్నీ అభిమానులు తోసిపుచ్చుతున్నారు. కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. ‘అజ్ఞాతవాసి’ కాపీ అయినంత మాత్రాన తమ హీరో నటించిన మూవీ.. హాలీవుడ్‌ కాపీ అనడానికి ఆధారాలేంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ యవ్వారానికి తెరపడాలంటే ‘నాపేరు సూర్య’ రిలీజయ్యేవరకు ఆగాల్సిందేనని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories