నాగ చైతన్య పై ప్రశంసల వర్షం కురిపించిన శివ

నాగ చైతన్య పై ప్రశంసల వర్షం కురిపించిన శివ
x
Highlights

అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్ళైన తర్వాత మొదటిసారిగా జంటగా నటిస్తున్న 'మజిలీ' సినిమాకి 'నిన్ను కోరి' ఫేం శివనిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా...

అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్ళైన తర్వాత మొదటిసారిగా జంటగా నటిస్తున్న 'మజిలీ' సినిమాకి 'నిన్ను కోరి' ఫేం శివనిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ సెంటర్ లో ఘనంగా జరిగింది. విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున ముఖ్య అతిధులుగా విచ్చేశారు. వైట్ అండ్ బ్రౌన్ డిజైనర్ డ్రెస్ లో సమంత అందంగా కనిపించింది. ఈ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ, చై గురించి చాలా గొప్పగా మాట్లాడారు.

"'నిన్ను కోరి' చూసి నా కోసం ఒక కథ రాయమని చైతన్య అడిగారు. కానీ అప్పటికి నా దగ్గర కథ లేదు. ఒక రెండు వరాల తర్వాత నాకు ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది. అదే పూర్ణ క్యారెక్టరైజేషన్. దానిని పావుగంట పాటు చై కి వినిపించాను. చైతూ కూడా చేద్దాం అన్నారు. ఈ చిత్రంలో చైతన్య నటన చూసి తనని ఎవరైనా కౌగిలించుకుని ఏడ్చేస్తారు. అంత గొప్పగా నటించాడు" అని పొగడ్తల వర్షం కురిపించారు శివ నిర్వాణ. ఇక ఈ చిత్రంలో అలాంటి మంచి పాత్ర ని తనకు ఇచ్చినందుకు చైతన్య తన శివకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5 న విడుదల కానుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని అక్కినేని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories