ఉద్యమకారులకు కాంగ్రెస్‌ మొండిచేయి... మరి నెక్స్ట్‌ ఏంటి?

ఉద్యమకారులకు కాంగ్రెస్‌ మొండిచేయి... మరి నెక్స్ట్‌ ఏంటి?
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమకారులకు మొండి చెయ్యి చూపించిచేలా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు ఉద్యమాలు చేసి ఉద్యమపార్టీలో టిక్కెట్టు రాక కాంగ్రెస్ గూటికి...

తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమకారులకు మొండి చెయ్యి చూపించిచేలా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు ఉద్యమాలు చేసి ఉద్యమపార్టీలో టిక్కెట్టు రాక కాంగ్రెస్ గూటికి చేరినా... ఉద్యమకారులను హస్తం పార్టీ పట్టంచుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీలో పార్టీ గొంతుకగా పనిచేసిన పొత్తుల పేరుతో ఉద్యమ నాయకులుగా పేరును నేతలకు టిక్కెట్టు దక్కేలా కనపించడం లేదు. దీంతో పార్టీ నిన్న మొన్నటి వరకు హుషారుగా కనిపించిన నేతలంతా నైరాష‌్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉద్యోగులు, న్యాయవాదులు, ఉస్మానియా విద్యార్థి నేతలు పోరాడారు. 2014 ఎన్నికల్లో ఉద్యమపార్టీలో అవకాశం రాకపోవడంతో, వెంటనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉద్యమకారులుగా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలుగా, తమకు పార్టీలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని భావించారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా సీటు వస్తుందని ఆశించారు. కానీ మహాకూటమి కారణంగా, వారి అంచనాలు తలకిందులవుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక రగిలిపోతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధులుగా ఉన్న శ్రావణ్, అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, క్రిషాంక్, ఇందిరా శోభన్‌లు పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. అనేక చర్చల్లో, అధికారపార్టీపై విమర్శలు చేశారు. పార్టీ స్టాండ్‌ను సమర్థంగా వాదించారు. శ్రావణ్‌కు ఖైరతాబాద్ నియోజకవర్గం దక్కుతుందని ప్రచారం జరిగింది. ఆయన కూడా తన సన్నిహితుల దగ్గరా అదే చెప్పుకున్నారు. అధిష్టానానికీ అదే విన్నవించుకున్నారు. కానీ శ్రవణ్ ఆశలు నెరవేరేలా లేవు. అద్దంకి దయాకర్ కూడా తుంగతుర్తిలో నాలుగున్నరేళ్లుగా పోరాడారు. సోషల్ మీడియాలోనూ క్యాంపెయిన్‌ చేశారు. ఇటు తుంగతుర్తి నియోజకవర్గంలోనూ బలం పెంచుకున్నారు. టికెట్‌ తనకే వస్తుందని ఆశించారు. కానీ తుంగతుర్తి టికెట్‌ దక్కేలా లేదని అర్థమవుతలోంది. ఇక బెల్లయ్యనాయక్.....మహబూబాబాద్, క్రిషాంక్-కంటోన్మెంట్, ఇందిరా శోభన్ -ముషిరాబాద్ ఆశించారు. కానీ మహాకూటమి పొత్త వీరి ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో వీరంతా తమ భవిష్యత్తుపై బెంగపడుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకండా మహాకూటమి కడుతోంది కాంగ్రెస్. అయితే సీట్లు త్యాగం చేయాల్సి రావడం, సొంతపార్టీలోనే వ్యతిరేకత పెంచుతోంది. టిక్కెట్లపై భారీ ఆశలు పెట్టుకున్న ఉద్యమకారులు, ఓయూ నేతలు ఇప్పుడు పార్టీలో రెబల్‌గా మారే అవకాశముందనే చర్చ జరుగుతోంది. పార్టీ మాత్రం పొత్తుల కారణంగా అందరికీ సీట్లు సర్డుబాటు చేయలేమని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి వీళ్లందర్నీ పార్టీ ఎలా బుజ్జగిస్తుందో చుడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories