కాంగ్రెస్‌లో ఆరు స్ధానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

కాంగ్రెస్‌లో ఆరు స్ధానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
x
Highlights

నామినేషన్ల దాఖలుకు తుది గడువు సమీపించినా కాంగ్రెస్‌లో తుది జాబితా సిద్ధం కాలేదు. మిగిలిన ఆరు స్ధానాలకు అభ్యర్ధులను ఖరారు చేసేందుకు అధిష్టానం తీవ్రంగా...

నామినేషన్ల దాఖలుకు తుది గడువు సమీపించినా కాంగ్రెస్‌లో తుది జాబితా సిద్ధం కాలేదు. మిగిలిన ఆరు స్ధానాలకు అభ్యర్ధులను ఖరారు చేసేందుకు అధిష్టానం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే జాబితా ఆలస్యమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మిర్యాలగూడ, నారాయణపేట్‌, దేవరకద్ర, నారాయణఖేడ్‌, కోరుట్ల, హుజూరాబాద్‌ స్ధానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో డీకే అరుణ, జైపాల్‌రెడ్డి మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకు ముదురుతోంది. తమ వర్గం వారికే టికెట్లు ఇవ్వాలంటూ ఇరువురు నేతలు పట్టుబట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక హుజూరాబాద్ టికెట్ కౌశిక్ రెడ్డికి ఇవ్వాలంటూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మిర్యాలగూడ స్ధానం తన కుమారుడికే ఇవ్వాలంటూ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మరో వైపు నారాయణ ఖేడ్ తనకే కావాలంటూ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ డిమాండ్ చేస్తుండగా కోరుట్ల టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, జువ్వాడి నర్సింగ్‌రావులు పోటీ పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories