థర్డ్ ఫ్రంట్ పై.. కాంగ్రెస్ ఆలోచన ఇదేనట!

థర్డ్ ఫ్రంట్ పై.. కాంగ్రెస్ ఆలోచన ఇదేనట!
x
Highlights

కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో.. ఇప్పుడు అందరికంటే కాంగ్రెస్...

కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో.. ఇప్పుడు అందరికంటే కాంగ్రెస్ లోనే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా ఇప్పుడు 20 రాష్ట్రాల్లో (21 ఉండేవి.. కానీ ఏపీలో ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కాదు.. కేవలం టీడీపీ సర్కారే ఉంది) ఎన్డీయే ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.

ఉన్న 26 రాష్ట్రాల్లో.. ఏకంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి.. కనీసం సగానికంటే ఎక్కువ ప్రాంతాల్లో బలం చాటుకున్నా.. మళ్లీ అధికారంలోకి రావడం అంత కష్టమైన పనేం కాదు. కానీ.. ఉన్న బలాన్నంతా పోగొట్టుకుని బలహీనపడి ఉన్న కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అలా కాదు. పైగా.. అధ్యక్షుడిగా రాహుల్ ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు కూడా సాధించలేదు.

అందుకే.. కాంగ్రెస్ నాయకత్వ మార్గదర్శకత్వం.. ఇప్పుడు ఈ విషయంపైనే అంతర్మథనం చేస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు.. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచనను బలపడనీయకుండా చేయడమే ఆ పార్టీ తక్షణ కర్తవ్యంగా తెలుస్తోంది. అంతేకాక.. థర్డ్ ఫ్రంట్ అంటూ మొదలు పెడితే.. అది అంతిమంగా బీజేపీకే లాభం కలిగించే అవకాశాలు కూడా ఉన్నట్టు కాంగ్రెస్ భావిస్తోంది.

పైగా.. దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 శాతం వరకూ పదిలంగా ఉన్న తమ ఓటు బ్యాంకు.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో చీలిపోతే.. తమకు ఇబ్బందే అని కాంగ్రెస్ అనుకుంటోంది. అందుకే.. అతి జాగ్రత్తగా ఈ విషయాన్ని డీల్ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం మార్గదర్శకత్వం.. భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories