కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ రిలీజ్‌..... బరిలో ఆర్‌. కృష్ణయ్య

Submitted by arun on Mon, 11/19/2018 - 10:20

కాంగ్రెస్‌ పార్టీ ఫైనల్‌ లిస్టును ప్రకటించింది. ఇప్పటివరకు 88మంది అభ్యర్ధులను అనౌన్స్ చేసిన కాంగ్రెస్‌ మిగిలిన ఆరుగురితో తుది జాబితా విడుదల చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్‌‌.కృష్ణయ్యకు మిర్యాలగూడ సీటును కేటాయించింది. ఇక ఫైనల్ లిస్ట్‌లోనైనా తమ పేరు ఉంటుందని ఆశించిన సీనియర్లకు మళ్లీ భంగపాటే ఎదురైంది.

కాంగ్రెస్‌ ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటించింది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 119 స్థానాల్లో 25 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించి 94 చోట్ల మాత్రమే పోటీకి దిగుతోన్న కాంగ్రెస్‌ ఇప్పటివరకు 88మంది అభ్యర్ధులనే ప్రకటించింది. దాంతో తుది జాబితాలో మిగిలిన ఆరుగురిని అనౌన్స్‌ చేసింది. కోరుట్ల నుంచి జువ్వాది నర్సింగరావు, నారాయణఖేఢ్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్, సికింద్రాబాద్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నారాయణపేట్ నుంచి వామనగిరి కృష్ణ, దేవరకద్ర నుంచి పవన్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ నుంచి ఆర్.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. 

మొదటి జాబితాలో 65మందిని, రెండో జాబితాలో 10మందిని, మూడో జాబితాలో 13మందిని ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం ఫైనల్ లిస్ట్‌లో మిగతా ఆరుగురిని ప్రకటించింది. అయితే ఆఖరి జాబితాలోనైనా తమ పేర్లు ఉంటాయని ఆశించిన పలువురు సీనియర్లకు మళ్లీ భంగపాటే ఎదురైంది. ముఖ్యంగా సనత్‌నగర్‌ టికెట్‌ ఆశించిన మర్రి శశిధర్‌‌రెడ్డికి, రాజేంద్రనగర్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కార్తీక్‌‌రెడ్డికి అధిష్టానం పెద్ద షాకే ఇచ్చింది. ఇక మిర్యాలగూడ టికెట్‌‌‍ను తన బంధువుకి ఇప్పించేందుకు జానారెడ్డి విశ్వప్రయత్నాలు చేసినా, ఎవరూ ఊహించని విధంగా బీసీ సంఘం నేత ఆర్‌‌.కృష్ణయ్యకు కేటాయించింది. దేవరకద్ర విషయంలో జైపాల్‌రెడ్డి, డీకే అరుణ మధ్య పెద్ద యుద్ధమే జరిగినా చివరికి డీకే అరుణ అనుచరుడైన పవన్ కుమార్‌‌రెడ్డికే అధిష్టానం జైకొట్టింది.
ఫైనల్ లిస్టు కూడా ప్రకటించేయడంతో టికెట్లు దక్కని నేతలంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు రెబల్స్‌గా తయారయ్యారు. అయితే నామినేషన్లకు ఈరోజే చివరి రోజు కావడంతో మరి ఎంతమంది రెబల్స్‌ బరిలోకి దిగుతారో చూడాలి.

English Title
Congress Releases Final List Of Candidates

MORE FROM AUTHOR

RELATED ARTICLES