కొత్త ఫ్రంట్‌గా కాంగ్రెస్‌ రెబల్స్‌...ఒకే సింబల్‌పై పోటీ చేయాలని నిర్ణయం

Submitted by arun on Fri, 11/16/2018 - 15:46

కాంగ్రెస్‌లో రెబెల్స్ అంతా మరో ఫ్రంట్‌గా ఏర్పడబోతున్నారు. పార్టీలో టిక్కెట్టు రాని వారంతా ఏకమై ఒకే సింబల్‌పై బరిలో దిగాలనుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం మరోసారి భేటీ అయిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. కామారెడ్డి నుంచి కృష్ణారెడ్డి, ఎల్లా రెడ్డి నుంచి సుభాష్‌రెడ్డి, ధర్మపురి నుంచి రవీందర్, చెన్నూర్ నుంచి బోడ జనార్ధన్, స్టేషన్‌ ఘన్‌పూర్ నుంచి విజయరామారావు, పరకాల నుంచి డి.సాంబయ్య, సూర్యాపేట నుంచి పటేల్‌ రమేష్‌రెడ్డి, చొప్పదండి నుంచి సుద్దాల దేవయ్యలను రెబెల్స్‌గా బరిలో దింపనున్నారు. 

English Title
Congress Rebel Candidates to Form Telangana Rebels Party

MORE FROM AUTHOR

RELATED ARTICLES