logo

ఖమ్మం పార్లమెంటు ఖచ్చితంగా గెలుస్తాం..

ఖమ్మం పార్లమెంటు ఖచ్చితంగా గెలుస్తాం..

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సీటు ఖచ్చితంగా గెలిచి తీరుతామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, కందాల ఉపేందర్‌ రెడ్డి, హరిప్రియా నాయక్‌లు పాల్గోన్నారు. ఖమ్మం జిల్లాలలో ప్రజాకూటమిని గెలిపించిన ప్రతిఒక్కరికి పేరు పేరునా భట్టి విక్రమార్క్ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాల విషయంలో కొంత అనుమానాలు ఉన్నమాట వాస్తమేనని భట్టి విక్కమార్క్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం డబ్బు, మందు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఖమ్మం ప్రజలందరూ చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారని భట్టి విక్కమార్క్ పెర్కోన్నారు.

లైవ్ టీవి

Share it
Top