పంచాయతీలకు ఏటా రూ.8 లక్షల నిధులు: సీఎం కేసీఆర్

పంచాయతీలకు ఏటా రూ.8 లక్షల నిధులు: సీఎం కేసీఆర్
x
Highlights

గ్రామ పంచాయతీలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా ఒక పంచాయతీకి ఏటా రూ.8 లక్షల అభివ‌ృద్ధి నిధులు అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి...

గ్రామ పంచాయతీలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా ఒక పంచాయతీకి ఏటా రూ.8 లక్షల అభివ‌ృద్ధి నిధులు అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ సఫల రాష్ట్రంగా పురోగమిస్తోందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో సీఎం పాల్గొన్నారు. పతాకావిష్కరణ అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తూ రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేసిన వాళ్లే అభివృద్ధి చేస్తారని తెలంగాణ ప్రజలు నమ్మారన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు టీఆర్ఎస్‌కే విజయం కట్టబెట్టారన్నారు సీఎం కేసీఆర్. రాజకీయ అవినీతికి దూరంగా బలమైన రాష్ట్రంగా నిలదొక్కుకుంది. ఐదేళ్లలో రాష్ట్రం 16.5 శాతం వృద్ధిరేటు సాధించిందన్నారు. ప్రపంచంలోనే వేగంగా నిర్మించే ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రలో నిలబోతుందన్నారు. అదేవిధంగా మరోవైపు సీతారామ ఎత్తిపోతల పథకం పనులు కూడా యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories