కాంగ్రెస్‌కు షాక్: ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌కు షాక్: ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్‌
x
Highlights

తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. మండలిలో ఇద్దరే సభ్యులు మిగిలి ఉండటంతో హోదాను కోల్పోయినట్లు అధికారిక వెబ్‌సైట్‌లో...

తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. మండలిలో ఇద్దరే సభ్యులు మిగిలి ఉండటంతో హోదాను కోల్పోయినట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అధికారులు వెల్లడించారు. దీంతో షబ్బీర్‌ అలీకి ప్రతిపక్ష నేత హోదాను కూడా రద్దు చేస్తూ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నలుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ ఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలంటూ మండలి ఛైర్మెన్‌ స్వామిగౌడ్‌కు లేఖ అందించారు. దీనిపై సాయంత్రం బులిటెన్‌ను విడుదల చేశారు. టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్‌ ఎల్పీని విలీనం చేస్తూ ప్రకటన రిలీజ్‌ చేశారు. ఇటు ఇవాళ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ విషయాన్ని పొందుపర్చారు. మండలిలో కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రతిపక్ష హోదా రద్దైనట్లు సైట్‌లో పొందుపర్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories