కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు

Submitted by arun on Thu, 07/19/2018 - 12:37

ఎన్నికల వేళ ప్రత్యర్ధులపై కత్తి దూయాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ వారిపైనే గురిపెడుతున్నారా? పార్టీపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుంటే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్లు భగ్గుమంటున్నారు ఇంతకీ ప్రభుత్వం వారిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది?

తెలంగాణ కాంగ్రేస్ లో కొత్త పంచాయితీ తాజగా తెరపైకి వచ్చింది. పార్టీకి చెందిన సీనియర్లందరకి ప్రభుత్వం వరుసగా సెక్యూరిటీ  తొలగిస్తుండడంతో పార్టీ నేతలంతా ఆందోళన చెందుతున్నారు. గతంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, తాజాగా మాజీ డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి , మాజి ఎంపి వి.హన్మంతరావులకు సైతం గన్ మెన్లను ఎత్తివేశారు. అయితే తమ సెక్యూరిటీని తొలగించినందుకు కాంగ్రెస్ లీడర్లంతా సొంత పార్టీపై చిందులేస్తున్నారు. పార్టీ ఫ్లోర్ లీడర్లు జానారెడ్డి, షబ్బీర్ అలీ పార్టీ నేతల కష్టాలను పట్టించుకోడం లేదని, అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించడం లేదని మండి పడుతున్నారు వారిద్దరి భద్రత బాగుంది కాబట్టి ఇతరుల కు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోరా అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. తమ దాకా వస్తేనే సమస్యగా గుర్తించడం తప్పని ఈనేతలు చెబుతున్నారు.

కాంగ్రేస్ నేతలను  ప్రభుత్వం టార్గెట్ చేసి వారి  భద్రతను తొలగిస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జానా, షబ్బీర్ సైలెంటు గా ఉండబట్టే  కోమటిరెడ్డి, సంపత్ కుమార్లకు ఇంకా న్యాయం దక్కడంలేదనే చర్చ  కాంగ్రెస్ లో జరుగుతోంది. ప్రభుత్వాన్ని కాంగ్రెస్  ఘాటుగా విమర్శిస్తుంది కాబట్టి కావాలనే భద్రతను ప్రభుత్వం తొలగిస్తుందనే ఆరోపణలు హస్తం పార్టీనేతలు చేస్తున్నారు. ఫ్లోర్ లీడర్ల  మెతక వైఖరి వల్లే  పార్టీకి ఇన్ని కష్టాలు వచ్చిపడుతున్నాయన్న వాదన కూడా గాంధీ భవన్లో ఉంది. ఇద్దరు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే కాంగ్రెస్ వైపు చూసేందుకు సాహసం కూడా ప్రభుత్వం చేయదని  ఆపార్టీ నేతలంటున్నారు. ఇకనైనా జానా షబ్బీర్ లు సొంతపార్టీ నేతల భద్రత పై వత్తిడి తేకపోతే విహెచ్ లాంటి వాళ్లు జానాతో కయ్యానికైనా రెడీ అవుతామని చెబుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో భద్రతపై గట్టిగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.

English Title
Congress Leaders Serious on Jana Reddy, Shabbir Ali over Remove Security Guards

MORE FROM AUTHOR

RELATED ARTICLES