logo

అసదుద్దీన్ ఆరోపణలపై స్పందించిన మహేశ్వర్‌రెడ్డి

అసదుద్దీన్ ఆరోపణలపై స్పందించిన మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన‌ అరోపణలను డిసీసీ అధ్యక్షుడు మహెశ్వర్ రెడ్డి ఖండించారు. నిర్మల్ ఎన్నికల ప్రచారానికి రావద్దని ఇరవై ఐదు లక్షల రూపాయల ఆఫర్‌ చేశానని అసదుద్దీన్ చేసిన‌ వ్యాఖ్యలపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆఫర్ చేసినట్లు ఆధారాలు బయట పెట్టాలని సవాల్ చేశారు‌. ఆరోపణలు నిజమైతే ఎన్నికల నుండి తప్పుకోవడమే కాదు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. అసదుద్దీన్ సభకు జనం రాకపోవడం వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అసదుద్దీన్ స్థాయి రూ.25లక్షలు అని తాము భావించడం లేదని అన్నారు. అసద్‌కు డబ్బు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

లైవ్ టీవి

Share it
Top