కేసీఆర్‌ ‘థర్డ్‌ఫ్రంట్‌’ ప్రకటన వెనక మోదీ!

కేసీఆర్‌ ‘థర్డ్‌ఫ్రంట్‌’ ప్రకటన వెనక మోదీ!
x
Highlights

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ జపం వెనుక అసలు సీక్రెట్ ఏంటి..? మూడో ప్రత్యామ్నాయం ఆలోచన ఎవరిది..? అసలు థర్డ్ ఫ్రంట్ వెనక ఎవరున్నారు..? మూడో కూటమిపై కాంగ్రెస్...

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ జపం వెనుక అసలు సీక్రెట్ ఏంటి..? మూడో ప్రత్యామ్నాయం ఆలోచన ఎవరిది..? అసలు థర్డ్ ఫ్రంట్ వెనక ఎవరున్నారు..? మూడో కూటమిపై కాంగ్రెస్ ఎందుకు విమర్శలు మొదలు పెట్టింది.

థర్డ్ ఫ్రంట్ అంటే కాంగ్రెస్ భయపడుతోందా..?.. బీజేపీకి లేని భయం కాంగ్రెస్‌‌కే ఎందుకు..?..మూడో కూటమి వల్ల ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

కేసీఆర్ థర్డ్ ప్రతిపాదన ఏడాది ముందే ఎన్నికల వేడి రాజేసింది. మూడో కూటమి ఏర్పాటు అనే మాట జాతీయ పార్టీల్లో కలకలం రేపితే దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ధర్డ్ ఫ్రంట్ పై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఎవరి విశ్లేషణలు ఎలా సాగినా కాంగ్రెస్‌లో మాత్రం పలు అనుమానాల్ని రేపింది. మూడో కూటమి వెనక కమలనాథులు ఉన్నారని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కొన్ని ప్రాంతీయ పార్టీలకు మోడీ నిధులు ఇచ్చారనే ఆరోపిస్తోంది.

ధర్డ్ ఫ్రంట్ వెనుక ప్రధాని మోడీ ఉన్నారనే ఆరోపణలకు కాంగ్రెస్ ఎన్నో కారణాలు చెబుతోంది. ప్రస్తుతం దేశంలో మోడీ హవా తగ్గుతోందని అంచనా వేస్తోంది. ఎందుకంటే వరుసగా కొత్త రాష్ట్రాల్లో జెండా ఎగరేస్తున్న బీజేపీకి ఇటీవల రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికలు షాక్ ఇచ్చాయి. కాషాయం పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌ లోక్‌ సభ, అసెంబ్లీ ఉప పోరులో ఆ పార్టీకి పరాజయమే మిగిలింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే ఫలితం వస్తే ఎలా అనే ఆలోచన కమలనాథుల్లో మొదలైంది. 2019లో అధికారం దక్కడానికి చెమటోడ్చక తప్పదని భావిస్తున్నారు.

పైగా ఎన్డీఏలో కూడా లుకలుకలు మొదలైయ్యాయి. శివసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. అకాలీదళ్ కూడా అసంతృఫ్తి స్వరం వినిపిస్తోంది. టీడీపీతో పొత్తు పొసగేలా కనిపించడం లేదు. ఇదే జాబితాలో ఎన్డీఏ కూటమిలోని ఇరత పార్టీలు చేరితే మరింత ప్రమాదం. పైగా కొద్ది నెలల్లో జరిగే యూపీ‌లోని గోరఖ్ పూర్; ఫూల్ పూర్ ఎంపీ స్థానాల ఉప ఎన్నికల కోసం బీఎస్పీ, ఎస్పీ పార్టీలు పొత్తు దిశగా సాగుతున్నాయి. మోడీ వ్యతిరేకులు ఏకీకరణ జరగడంతో పాటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక గాలి వీస్తే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలే బీజేపీకి కీలకంగా మారతాయి. అందుకే మోడీ నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ అంటూ తృతీయ కూటమిని తెరపైకి తెచ్చారని హస్తం పార్టీ అంటోంది. మూడో కూటమి కారణంగా ఓట్లు చీలిపోతే బీజేపీకే లాభమని కాంగ్రెస్ లెక్కలు కడుతోంది. అందుకే...వచ్చే వారంలో జరిగే AICC ప్లీనరీలో... ధర్డ్ ఫ్రంట్‌ గురించి చర్చించడంతో పాటు తమతో కలసి వచ్చే బీజేపీ వ్యతిరేక పార్టీలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories