సజ్జన్‌ కుమార్‌ను దోషిగా తేల్చిన హైకోర్టు

సజ్జన్‌ కుమార్‌ను దోషిగా తేల్చిన హైకోర్టు
x
Highlights

1984 సిక్కు వ్యతిరేక ఘర్షనలో కాంగ్రెస్ నేత సజ్జన్ కు ఢీల్లీ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. సోమవారం ఢీల్లీ హైకోర్టులో సజ్జన్ దోషిగా తేల్చింది. ఈ కేసులో...

1984 సిక్కు వ్యతిరేక ఘర్షనలో కాంగ్రెస్ నేత సజ్జన్ కు ఢీల్లీ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. సోమవారం ఢీల్లీ హైకోర్టులో సజ్జన్ దోషిగా తేల్చింది. ఈ కేసులో సజ్జన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఢీల్లీ హైకోర్టు తిప్పికొట్టింది. ఈ కేసులో సజ్జన్‌ కుమార్‌ను దోషిగా ప్రకటించి సజ్జన్‌కు జీవిత ఖైదు విధించింది. ఈనెల డిసెంబర్ 31లో సజ్జన్ పోలీసులకు లొంగిపోవాలని ఢీల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 1984 అక్టోబరు 31న భారత ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఆమె వ్యక్తిగత భద్రతాసిబ్బంది కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ మరునాడే భారత దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పలు కేసులు నమోదయ్యాయి. అయితే అల్లర్లలో భాగంగా ఢీల్లీలోని కంటోన్మెంట్‌ వద్ద ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు. కాగా ఈ కేసులో సజ్జన్‌ను నిర్ధోషిగా ప్రకటిస్తూ మరో ఐదుగురిని దోషులుగా పేర్కొన్నప్రత్యేక న్యాయస్ధానం ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories