ఉత్తమ్ వల్లే నాకు టికెట్ దక్కలేదు : మర్రి శశిధర్‌రెడ్డి

Submitted by arun on Sat, 11/17/2018 - 16:50

సనత్ నగర్‌ సీటు తనకు రాకపోవడం వెనక కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ తీరు వల్లే తనకు టికెట్ దక్కలేదంటూ ఆయన ఆరోపించారు. సర్వేల పేరుతో తాను గెలవలేనంటూ స్క్రీనింగ్ కమిటీలో వాదించి టికెట్  రాకుండా అడ్డుకున్నారంటూ విమర్శించారు. తనకు టికెట్ రాకుండా ఉండేందుకే సనత్ నగర్ సీటును టీడీపీ అడగకపోయినా కేటాయించారంటూ మర్రి ఆరోపించారు.  పార్టీ కోసం త్యాగాల చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించిన ఆయన పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం తనదికాదన్నారు.  పొత్తుల అనంతరం విడుదల చేసిన అభ్యర్ధుల జాబితాపై మరోసారి ఆలోచించాలని అధిష్టానానికి సూచించారు. టీడీపీ అభ్యర్ధికి తాను మద్దతు ప్రకటించినా ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుందో చెప్పలేనన్నారు. 

English Title
Congress Leader Marri Shashidhar Reddy Speaks to Media

MORE FROM AUTHOR

RELATED ARTICLES