విశాఖలో తగ్గిపోతున్న రక్త నిల్వలు

విశాఖలో తగ్గిపోతున్న రక్త నిల్వలు
x
Highlights

వేసవిలో నీటికే కాదు రక్తానికి కొరత ఏర్పడింది. బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. దాతలు ముందుకు రాకపోవడం..ఉన్న నిల్వలు స్టోరేజ్ చేసే అవకాశం...

వేసవిలో నీటికే కాదు రక్తానికి కొరత ఏర్పడింది. బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. దాతలు ముందుకు రాకపోవడం..ఉన్న నిల్వలు స్టోరేజ్ చేసే అవకాశం లేక నిండు ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. ఒక వ్యక్తి చేసే రక్తదానమే మరొకరిని ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. అత్యవసర సమయాల్లో రోగులు ఆసుపత్రి బెడ్ పై ఉంటే బంధువులు బ్లడ్ బ్యాంకుల చుట్టూ పరుగులు తీయాల్సి వస్తోంది. విశాఖ సాగర తీరంలో రక్తం కొరతపై స్పెషల్ రిపోర్ట్.

వేసవి ఊష్ణోగ్రతలతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత అధికమవుతోంది. విశాఖలో రక్త నిల్వలు పూర్తిగా తగ్గు ముఖం పట్టాయి. నగర జనాభాతో పాటు ఒరిస్సా, చత్తీస్ ఘడ్, ఝార్కండ్ ప్రాంతాల నుంచి వివిధ జబ్బులతో చికిత్స కోసం విశాఖ వస్తుంటారు. నగరంలో రక్తనిల్వలు కనీసం 80 వేలు యూనిట్లు వుండాలి. కానీ ప్రస్తుతం నగరంలో వున్న బ్లడ్ బ్యాంకుల్లో కేవలం 20 నుండి 40 శాతం యూనిట్లు మాత్రమే రక్త నిల్వలు అందుబాటులో వున్నాయి.

విశాఖలో కేజీహెచ్, రెడ్ క్రాస్, లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంకులతో పాటు మరో పది స్వచ్ఛంధ సంస్థలు బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. కార్పోరేట్ హస్పిటల్స్ లో మరికొన్ని బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఒక్క కేజీహెచ్ తప్ప ఇతర హస్పటల్స్ లో రక్తం కొరత కనిపిస్తుంది. రక్తదాన చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నా స్టోర్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో రక్త నిల్వలకు కొరత తప్పడం లేదు.

ఒక వ్యక్తి నుండి 250 నుండి 300 ఎమ్ఎల్ రక్తం మాత్రమే సేకరిస్తారు. ఒక వ్యక్తి రక్తదానం చేస్తే మరో మూడు నెలల వరకు చేయడానికి అవకాశం వుండదు. వేసవి కాలం కావడంతో రక్తం ఇచ్చే వారు కూడా వెనుకడుగు వేస్తున్నారు. రక్తం దానం చేస్తే ఏమవుతుందో అన్న భయం పలువురిని రక్తదానం వైపు వెళ్లనీయడం లేదు. ఈ నేపద్యంలో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడుతోంది. వేసవిలో విద్యాసంస్థలకు వేసవి సెలవులు కావడంతో రక్తదాన శిబిరాలు నిర్వహించే అవకాశం లేకుండా పోయిందంటున్నారు వైద్యులు. స్వచ్ఛందంగా వచ్చి రక్తం చేసే వారి సంఖ్య తక్కువగా ఉంటుందంటున్నారు. ఏదిఏమైనా రక్తం అవసరాలను ముందుగానే గుర్తించి రక్త సేకరణ చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు నిలబెట్టాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories