కాంగ్రెస్‌‌కు షాకుల మీద షాకులు...దానం దారిలో మరికొందరు సీనియర్లు

కాంగ్రెస్‌‌కు షాకుల మీద షాకులు...దానం దారిలో మరికొందరు సీనియర్లు
x
Highlights

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో మరికొంత మంది...

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో మరికొంత మంది సీనియర్లు ఆయన దారిలో పార్టీకి Related imageగుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌, ఆయన కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ రాజీనామాపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. దానంను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, దానం నాగేందర్‌ ఇంట్లో లేకపోవడంతో ఆయనకు ఫోన్‌ చేశారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని వీడొద్దని, పదవుల విషయంలో అసంతృప్తి ఉంటే అధిష్ఠానంతో చర్చించాలని దానంకు సూచించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories