కాంగ్రెస్‌లో పదవుల రేస్‌

Submitted by arun on Thu, 08/30/2018 - 18:33

ముందస్తు ఊహాగానాల మధ్య కాంగ్రెస్‌ యాక్షన్‌ ప్లాన్‌కు సిద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ ఉండేలా యంత్రాంగానికి పార్టీ అధినేత రాహుల్‌గాంధీ పర్‌ఫెక్ట్‌ డైరెక్షన్స్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు హస్తినకు పయనమయ్యారు. తెలంగాణలో ముందస్తు హడావిడిపై ఏఐసీసీ ఇన్‌ఛార్జి కుంతియా సహా ఇతర ఇన్‌ఛార్జిలు కాంగ్రెస్‌ పెద్దలతో చర్చించినట్టు సమాచారం. 

ముందస్తు ముచ్చటపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లారు. టీఆర్ఎస్‌ ప్రగతి నివేదన సభ, ముందస్తు ఊహాగానాల మధ్య తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యులతో చర్చించినట్టు తెలుస్తోంది. టీపీసీసీల కమిటీలు చాలారోజుల నుంచి పెండింగ్‌లో ఉండటం ఇంతలోనే ఉత్తమ్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. 

ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ పీసీసీ కార్యవర్గం, అనుబంధ కమిటీలను ఏఐసీసీ ఖరారు చేసే అవకాశాలున్నట్టు సమాచారం. నిర్ణయం రాహుల్‌గాంధీకి వదిలేస్తూ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ బయలుదేరడంతో ఏం జరగబోతోందా అన్న ఆసక్తి కనిపిస్తోంది నేతల్లో. హస్తినలో ఆశావాహులు ప్రయత్నాలు సాగిస్తూనే పార్టీ పదువల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎదురుచూస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఆసక్తికరమైన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రచార కమిటీ సారథ్య బాధ్యతను కోరుకుంటున్న వీహెచ్‌ ప్రచారం కోసం ఒక రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. తాను ఆశిస్తున్న పదవి గనుక దక్కకపోతే కఠిన నిర్ణయం తీసుకుంటానంటున్న వీహెచ్‌ వ్యాఖ్యల మధ్య కాంగ్రెస్‌ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందోనని కార్యకర్తలు కలవరపడుతున్నారు.

పీసీసీ కార్యవర్గం, టీపీసీసీ అనుబంధ కమిటీల నియామక నిర్ణయం ఇప్పుడు అధినేత రాహుల్‌ చేతిలో ఉంది. వీహెచ్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ బాధ్యతను ఆశిస్తుండటం ఎడ్జ్‌ ఎక్కువగా రేవంత్‌కు కనిపిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే హెచ్ఎంటీవీ చేతిలో కొన్ని ఆధారాలు చిక్కాయి. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా రేవంత్‌రెడ్డి పేరు, మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా దామోదర రాజనర్సింహా, ప్రచార, మ్యానిఫెస్టో కమిటీల కో కన్వీనర్‌గా డీకే అరుణ, కోమటిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌, మూడో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బలరామ్‌నాయక్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Tags
English Title
Congress Action Plan in Rahul Gandhi's Direction

MORE FROM AUTHOR

RELATED ARTICLES