logo

మళ్లీ నామినేషన్ వేసిన వేణుమాధవ్!

మళ్లీ నామినేషన్ వేసిన వేణుమాధవ్!

సూర్యాపేట జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా కమెడియన్‌ వేణుమాధవ్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం నామినేషన్‌ వేయడానికి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి రాగా ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో సోమవారం మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన మద్దతు దారులతో వచ్చి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను ఆయన సమర్పించారు. కోదాడ తన స్వస్థలం కావడంతో ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నట్లు వేణుమాధవ్‌ తెలిపారు. గురువారం వేణుమాధవ్ నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి.. సరైన వివరాలు లేవని, నామినేషన్ చెల్లదని తెలిపారు. దీంతో నిరాశ చెందిన వేణుమాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుని శని లేదా ఆదివారాల్లో నామినేషన్‌ దాఖలు చేస్తానని తెలిపారు. తన స్వస్థలం కావడంతో కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వివరించారు.

లైవ్ టీవి

Share it
Top