ఆ నిర్మాత గురించి తెలిసి కూడా ఆమె గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్లింది? : నటుడు పృధ్వీ

Submitted by arun on Sat, 06/30/2018 - 14:10
comedian prudhvi

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని కమెడియన్ పృథ్వి తెలిపాడు. కొంత మంది వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ''సినిమా కోసం నిర్మాత కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు.. అలాంటిది కథకు సరిపోయే హీరోయిన్ ను మాత్రమే ఆయన తీసుకుంటారు. మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ లాంటి అమ్మాయిని కథకు సెట్ అవుతుందనే తీసుకొచ్చారు. ఇక్కడున్న వాళ్లతో ఆ పాత్ర చేయించలేమని అన్నారు. కొన్నేళ్ల కిందటి వరకు తెలుగు అమ్మాయిలే హీరోయిన్లుగా రాణించారు. ఇప్పుడు టాప్ హీరోల సరసన సరిపోయే తెలుగు అమ్మాయిలను చూపించండి'' అంటూ ఎదురు ప్రశ్నించారు. అలానే సినిమా ఇండస్ట్రీ పరువు పోయేలా కొందరు ఆర్టిస్టులు వ్యవహరిస్తుండడం బాధాకరమని అన్నారు. ఓ సినీ నిర్మాత గురించి గతంలో  ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది.. ఆమెను ఉద్దేశిస్తూ పృధ్వీ ప్రొడ్యూసర్ గురించి తెలిసి కూడా ఆమె గెస్ట్ హౌస్ కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. ఇలా కొందరు చేస్తోన్న కామెంట్ల కారణంగా జనాల్లో సినిమా వాళ్లంటే చులకన భావం ఏర్పడిందని అన్నారు. 

English Title
comedian prudhvi comments on casting couch in tollywood

MORE FROM AUTHOR

RELATED ARTICLES