యాంకర్‌ భర్తకు రెండో పెళ్లి..

యాంకర్‌ భర్తకు రెండో పెళ్లి..
x
Highlights

వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. తన స్వగ్రామమైన విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం...

వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. తన స్వగ్రామమైన విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన సౌజన్యను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు. తెలుగు సినీ రంగంలో రాణిస్తున్న జోగినాయుడు, గతంలో ప్రముఖ యాంకర్ ఝాన్సీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై వారిద్దరి మధ్యా వచ్చిన మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. మరోసారి పెళ్లి పీటలు ఎక్కిన జోగినాయుడికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories