కాలేజీ విద్యార్ధిని లైంగికంగా వేధించిన ప్రిన్సిపల్

Submitted by arun on Wed, 08/22/2018 - 09:54
Vocational college

విశాఖలోని విశాఖ ఒకేషనల్‌ కాలేజ‌్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రిన్సిపల్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. సూటిపోటీ మాటలతో  చీటికి మాటికి తమను వేధిస్తున్న  ప్రిన్సిపల్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు.  ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగిన స్ధానికులు కాలేజీలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని కాలేజీ దగ్గరకు వచ్చిన ప్రిన్సిపల్ భార్య  కాలేజీలో  గత కొద్ది కాలంగా అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. మహిళా ఉద్యోగితో కలిసి తన భర్త అరాచకాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

English Title
College MD held for sexual assault bid on student

MORE FROM AUTHOR

RELATED ARTICLES