ఊరూరా కాళేశ్వరం సంబురాలు..

ఊరూరా కాళేశ్వరం సంబురాలు..
x
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఊరూరా సంబురాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న...

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఊరూరా సంబురాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎక్కడికక్కడే సంబురాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం. అంతర్‌ రాష్ట్ర వివాదాలు పరిష్కరించి, అందరూ ఆశ్చర్యపోయేలా.. కేవలం మూడేళ్ల రికార్డు సమయంలో ప్రాజెక్టు పనులను పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనంటోంది టీఆర్‌ఎస్‌. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుమారు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. శుక్రవారం ప్రారంభోత్సవం జరుపుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. అయితే, ఈ ప్రాజెక్టు క్రెడిట్ అంతా తమ పార్టీదేనంటోంది గులాబీ దళం.

ఈ చారిత్రక సందర్భాన్ని ఊరూరా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని టీర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. గోదావరి నదికి పైన, కింద ఉన్న రెండు రాష్ట్రాల సీఎంల సమక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నందున ప్రతి గ్రామంలో పండగ వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. రైతులు, ప్రజలను ఈ సంబురాల్లో మమేకం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిచ్చారు. ఉద్యమ సమయంలో పార్టీ ప్రస్థానం సాగిన తీరును పునశ్చరణ చేసిన కేసీఆర్... పార్టీ సంస్థాగత నిర్మాణం జరగాల్సిన తీరుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన కృషికి గాను పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున సీఎం కేసీఆర్‌ను అభినందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories