వివాదాస్పదమైన కలెక్టర్ ఆమ్రపాలి ప్రసంగం

Submitted by arun on Sat, 01/27/2018 - 10:32
Amrapali

ఆమె ఒక ఐఏఎస్‌ అధికారి.. సాక్షాత్తు జిల్లా పరిపాలనాధికారి. గణతంత్ర వేడుకల్లో జెండా వందనం చేశాక ఆమె చేసే ప్రసంగం జిల్లా అభివృద్ధి ప్రణాళికకు అద్దం పట్టాలి.. ఇంతవరకు సాధించిన ప్రగతి గణాంకాల పట్టం కట్టాలి. ఇదంతా ఎంతో హుందాగా.. అందంగా సాగాల్సిన కార్యక్రమం. కాని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి గణతంత్ర వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగం మాత్రం అలా కాకుండా ‘నవ్వులపాలైంది’.. జిల్లాల్లో చర్చనీయాంశమైంది.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కారణం ఆమె తన ప్రసంగం మధ్యలో అదే పనిగా అకారణంగా నవ్వడం...గణాంకాల దగ్గర తడబడటం... మధ్యలో ఇట్స్‌ఫన్నీ అని వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. హన్మకొండ పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ ఆమ్రపాలి జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత తెలుగులో రాసిన ప్రసంగ పాఠాన్ని చదువుతూ ఆమె అనేక సార్లు తడబడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి ప్రస్తావన వచ్చినపుడు ఏకంగా వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తనలోతాను ‘ఇట్్స ఫన్నీ’ అని వ్యాఖ్యానించడం.. అదంతా మైకుల ద్వారా ప్రసారం కావడంతోపాటు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం విశేషం.

English Title
collector amrapali republic day speech

MORE FROM AUTHOR

RELATED ARTICLES