కలెక్టర్ ఆమ్రపాలికి సెలవు మంజూరు.. పెళ్లిపీటలు ఎక్కనున్న కలెక్టర్

Submitted by arun on Wed, 02/07/2018 - 16:14
Amrapali Kaata

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలికి ఈనెల 15వ తేదీ నుంచి మార్చి 7 వరకు తెలంగాణ ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. 21 రోజుల పాటు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన జమ్మూకాశ్మీర్‌లో ఐపీఎస్ అధికారి, డయ్యూడామన్ ఎస్పీ సమీర్ శర్మతో ఆమ్రపాలి వివాహం అట్టహాసంగా జరుగనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె ఫిబ్రవరి 15 నుంచి మార్చి 7వ తేదీ వరకు లాంగ్ లీవ్ తీసుకోనున్నారు. ఇక పెళ్లి పూర్తయ్యాక ఈ నెల 22 నుంచి 25లోపు ఏదైనా ఒక తేదీలో హైదరాబాదులో వివాహ రిసెప్షన్ వుంటుందని టాక్. అనంతరం 26న భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి హనీమూన్‌ కోసం టర్కీ వెళ్తారు. ఆమ్రపాలి సెలవుపై వెళుతుండటంతో అర్బన్ కలెక్టర్ గా జేసీ దయానంద్ కు, రూరల్ కలెక్టర్ గా జేసీ హరితకు అదనపు బాధ్యతలను అప్పగించారు. సెలవుల తర్వాత వరంగల్ అర్బన్ కలెక్టర్, రూరల్ ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా ఆమ్రపాలి కొనసాగుతారు. 
 

English Title
collector amrapali kaata going get married

MORE FROM AUTHOR

RELATED ARTICLES