logo

మహాకూటమి గెలిస్తే మళ్ళీ చీకటి రోజులు వస్తాయి : కేసీఆర్

మహాకూటమి గెలిస్తే మళ్ళీ చీకటి రోజులు వస్తాయి : కేసీఆర్

తెలంగాణ ఆవిర్భవించి నాలుగున్నర ఏ‌ళ్ళే అయినా అనేక విషయాల్లో దేశంలో అగ్ర స్థానంలో నిలిచిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. తెలంగాణలో కనురెప్ప పాటు కూడా కరెంటు పోయే అవకాశం లేదని అన్నారు. ఒకవేళ పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్ళీ చీకటి రోజులు వస్తాయని కేసీఆర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా రాబోయే రోజుల్లో వాటర్ జంక్షన్ కాబోతోందని సీఎం కేసిఆర్ అన్నారు. రైతులు సాగునీటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఇకపై ఉండబోదని చెప్పారు. రైతుబంథు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలని హుజూరాబాద్ మండలం శాలపల్లి సభలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

లైవ్ టీవి

Share it
Top