శాసనసభ రద్దుపై నిర్ణయం చెప్పేసిన సీఎం కేసీఆర్

Submitted by nanireddy on Sun, 09/02/2018 - 19:31
cm kcr responds sabha raddhu in pragathi nivedhana sabha

 అందరూ ఊహించినట్టుగానే త్వరలోనే  తెలంగాణ శాసనసభను రద్దు చేసి.. తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ఊహాగానాలకు తెరపడింది. ప్రగతి నివేదనసభ సాక్షిగా శాసనసభ రద్దుపై తన నిర్ణయాన్ని ప్రకటించారు సీఎం. కొద్దీ రోజులుగా తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు వస్తాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే  క్యాబినెట్ లో ఈ విషయంపై చర్చించామని.. సహచర మంత్రులు తన నిర్ణయమే మా నిర్ణయం అన్న రీతిలో చెప్పారని .. తెలంగాణ రాష్ట్రానికి ఏది మంచి అయితే ఆ నిర్ణయం తీసుకోమన్నారు. కచ్చితంగా శాసనసభ రద్దుపై భవిశ్యత్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు కొత్త రాష్ట్రం.. ఆర్థిక పరిస్థితి ఎంటో తెలియదు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల వరకు విపత్కరమైన పరిస్థితి. మహూబూబ్‌నగర్‌ నుంచి 15 లక్షల వలసలు, అన్ని కష్టాలను అర్థం చేసుకొని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటు ముందుకు వెళ్లాం. పదేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలో  10 కోట్ల రూపాయలలోపు ఇసుకకు ఆదాయం వస్తే నాలుగేళ్ల తెరాస పాలనలో దాదాపు 2 వేల కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ వస్తే కరెంట్‌ ఉండదని ఓ ముఖ్యమంత్రి చెప్పిండు. చిమ్మన చీకటి అయితది అని చెప్పిన స్థితి నుంచి  ఈ రోజు 24 గంటలు వెలిగేలా.. భారత్‌లో రైతులకు 24 గంటలిచ్చే రాష్ట్రం తెలంగాణే అనే చెప్పేలా చేశాం. ఈ సందర్బంగా భవిష్యత్తులో ఒక రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను అని అన్నారు. పోచంపల్లిలో సరైన ఆదాయం రాబడి లేక చేనేత కార్మికులు ఒకే రోజు 7గురు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో నాటి  ముఖ్యమంత్రిని ఒక్కొక్కరికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వమంటే ఇవ్వలేదు. మేం జోల పట్టి ఇస్తానని చెప్పి ఇచ్చాం. సిరిసిల్లాలో 11 మంది చనిపోతే టీఆర్‌ఎస్‌ తరపున సాయం అందజేశాం. ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణ వస్తే మన బాధలు తీరుతాయని చెప్పా. ఇప్పుడు బతుకమ్మ చీరలు, రంజాన్‌కు పేదలకు ఇచ్చే దుస్తులతో వారికి పనిఇచ్చి ఆదుకుంటున్నామన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో యాదవులకు చేసింది ఏమి లేదు. తెలంగాణ వచ్చిన నాలుగేళ్లలో వారికీ యాదవుల అభివృద్ధికి పాటు పడ్డాం.. వారికీ 70 లక్షల గొర్రెలు ఇచ్చాం. వాటికి 30 లక్షల పిల్లలు పుట్టాయి. దీంతో యాదవులకు మేలు జరిగింది. అలాగే 2లక్షల 11 వేల పాడిరైతులకు సబ్సిడీ అందజేశాం అని చెప్పారు. 22 వేల గ్రామాలకు నీరు అందుతోందని, మరో 1500 గ్రామాలకు వారం పది రోజుల్లో తాగునీరు అందిస్తామన్నారు. ఎన్నికలకు ముందే ఇంటింటికి గోదావరి, కృష్ణా నీళ్లు ఇస్తామని, మిషన్‌ భగీరథను అందరూ పొగుడుతున్నారని.. గతంలో మిషన్‌భగీరథ ద్వారా వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఓట్లడగనని చెప్పానని, ఏ ముఖ్యమంత్రి కూడా  ఇంత ధైర్యంగా చెప్పలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. త్వరలోనే రాజ్యసభ సభ్యులు కేకే ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసి.. ఏ విధమైన హామీలు ఇవ్వాలి. ఇంకా ప్రజల శ్రేయస్సుకు ఏమి చేస్తే బాగుంటుందో.. రానున్న మానిఫెస్టోలో పొందుపరుస్తామని సీఎం అన్నారు. 

English Title
cm kcr responds sabha raddhu in pragathi nivedhana sabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES