ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్‌

ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్‌
x
Highlights

తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మ నిర్వహించిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ తెలంగాణ...

తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మ నిర్వహించిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం రామశర్మను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్‌ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాను డాక్టర్ లేదా ఇంజినీర్ కావాలని నాన్న కోరుకునే వారని కేసీఆర్ గుర్తు చేశారు. మా గురువు గారు సాహితీ కవాటాలు తెరిచి నన్ను సాహిత్యం వైపు తీసుకుపోయారని తెలిపారు. ఇంటర్ చదివే రోజుల్లో గురువులు తనను ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. ఒకప్పుడు నాకు కూడా 3 వేల తెలుగు పద్యాలు కంఠస్తం వచ్చేవని సీఎం గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories