టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఏం చెప్పారంటే..

టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఏం చెప్పారంటే..
x
Highlights

పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపై టీఆర్ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి సమావేశాలు కావడంతో...

పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపై టీఆర్ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి సమావేశాలు కావడంతో రాష్ట్రం తరపున బలంగా గళం వినిపించాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలను ఆదేశించారు.

పార్లమెంట్ సమావేశాలను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వేదికగా మార్చాలని సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలకు సూచించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీకి అందిన విజయంతో నేతలపై బాధ్యత మరింత పెరిగిందని ఈ దశలో కేంద్రం నుంచి రావాల్సిన వివిధ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలను ప్రస్తావించాలని ఆదేశించారు. కేసీఆర్‌ అధ్యక్షతన రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలకు సూచించారు. 52 అంశాలను జాతీయ స్థాయిలో ఎత్తిచూపాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజన హామీలతో పాటు పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, బడ్జెట్‌కే పరిమితమైన వివిధ పనులపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. వీటికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖలకు మరోసారి వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్‌లో గట్టిగా పట్టుబట్టాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. జనవరి 1నాటికి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అయ్యేలా ఒత్తిడి తేవాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఎయిమ్స్‌తో సహా అన్ని విషయాలపైనా కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఎంపీలు సమావేశాలకు సోమవారం నుంచి విధిగా హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేయాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories