ఇంతకీ కేసీఆర్ ఆ ఇద్దరికి టిక్కెట్లు ఎందుకివ్వలేదు...బ్యాక్‌బెంచ్‌లోకి ఎందుకు నెట్టేసినట్టు?

Submitted by arun on Fri, 09/07/2018 - 10:07

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ‌్యమంత్రి కేసీఆర్‌ ఇద్దరు సిట్టింగ్‌లకు ఖతర్నాక్ షాకిచ్చారు. ఆంథోల్‌, చెన్నూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరిస్తూ తొలి జాబితాను విడుదల చేశారు. ఇంతకీ కేసీఆర్ ఆ ఇద్దరికి టిక్కెట్లు ఎందుకివ్వలేదు? 

ఆంథోల్‌ బాబుమోహన్‌కు, చెన్నూర్‌ నల్లాల ఓదేలుకు కేసీఆర్‌ మాస్టర్‌ స్ట్రోక్ ఇచ్చారు. ప్రవర్తన, పనితీరును బేస్‌ చేసుకొని ఈసారి వారిని లిస్టు నుంచి ఎలిమినేట్ చేశారు. గతంలో అధికారులతో ప్రవర్తించిన తీరు నియోజకవర్గ సమస్యలను పట్టించుకోని విధానం ఇలా నిరాకరణకు ఆఫ్‌ ద రికార్డుగా నాలుగైదు కారణాలు చూపుతూ వారిని బ్యాక్‌బెంచ్‌లోకి నెట్టేశారు.

వాస్తవానికి బాబూమోహన్‌ వ్యవహారశైలి, ప్రవర్తన, మాటతీరుపై కేసీఆర్‌కు భారీగానే ఫిర్యాదులు అందాయి. ఏ స్థాయి అధికారినైనా నోటికొచ్చినట్టు తిట్టే బాబుమోహన్ గతంలో ఓ ఎమ్మార్వోను బహిరంగంగా తిట్టిపోశారు. అప్పట్లో అది మీడియాలో బాగా హైలైట్‌ అయింది. ఇలాంటి గొడవల వల్లే బాబుమోహన్‌‌న వెనక్కి నెట్టేసి ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక నల్లాల ఓదేలు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఓదేలు సరిగ్గా పనిచేయలకపోయారన్న అపవాదు ఉంది. నియోజకవర్గంపై పట్టు, ప్రజలతో సత్సంబంధాల విషయంలో, అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విషయంలో సరైన విధంగా వ్యవహరించలేకయారన్న ఓ కారణంతో కూడా ఓదేలుకు టిక్కెట్‌ ఇవ్వకపోవచ్చుంటోంది గులాబీదళం. 

English Title
CM KCR Gives Shock to Andole And Chennur Sitting MLAS

MORE FROM AUTHOR

RELATED ARTICLES