ఆయనను సప్పడు చేయకుండా ఎలక్షన్లో నిలబెడదాం : సీఎం కేసీఆర్

Submitted by arun on Sun, 09/02/2018 - 13:36
kcr

ముందస్తు వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో  నిన్న విద్యుత్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. కరెంట్ ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. 35 శాతం పీఆర్సీ ప్రకటించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావును ప్రస్తావించారు. ఆ వెంటనే ప్రగతి భవన్‌ ప్రాంగణమంతా విద్యుత్తు ఉద్యోగుల నినాదాలతో మార్మోగింది. దాంతో.. ‘‘ప్రభాకర్‌రావు గారికి గాలి బాగున్నట్లుంది. సప్పడు చేయకుండా ఎలక్షన్లో నిలబెడదాం. ఆయన ఒప్పుకొంటే పార్టీకి లాభమయితది’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దాంతో, ఉద్యోగులంతా ‘ప్రభాకర్‌రావు జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు.

English Title
cm kcr announces 35 percent prc for electricity board employees

MORE FROM AUTHOR

RELATED ARTICLES