విజయాన్నిచ్చే వినాయకుడు

విజయాన్నిచ్చే వినాయకుడు
x
Highlights

పూజల్లో తొలిపూజ వినాయకునిదే. విఘ్ననాయకునిగా గణపతి ప్రసిద్ధి. విఘ్నేశ్వరుడు పలు రూపాల్లో పలు ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అటువంటి వాటిలో సుప్రసిద్ధమైనది...

పూజల్లో తొలిపూజ వినాయకునిదే. విఘ్ననాయకునిగా గణపతి ప్రసిద్ధి. విఘ్నేశ్వరుడు పలు రూపాల్లో పలు ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అటువంటి వాటిలో సుప్రసిద్ధమైనది శ్రీకాళహస్తి లోని పాతాళ వినాయకుని రూపం. శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం లో ధూర్జటి.. హరివిలాసంలో శ్రీనాధుడు ఈ వినాయకుని గురించి వివరించారు. భూమి లో దాదాపుగా 40 అడుగుల లోతులో ఈ విఘ్నరాజుడు కొలువై వున్నాడు. కాళహస్తి వెళ్లిన భక్తులు ఈ లంబోదరుడ్ని చూడకుండా రారు.

పాతాళంలో నివాసం ఏర్పరుచుకున్న ఈ విజయవినాయకుని గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం అగస్త్యుడు ఈ క్షేత్రంలో జీవనదిని ప్రవహింపజేయాలనే ఉద్దేశంతో పరమశివుడిని ప్రార్ధించాడు. స్వర్ణముఖి నది పాయ ఏర్పడింది కానీ అందులో నీళ్లు లేవు. వినాయకుడిని ప్రార్ధించకుండా ఈ కార్యానికి పూనుకోవడమే అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు, ఆ స్వామిని ప్రార్ధించాడు. పాతాళ మార్గంలో అక్కడికి చేరుకున్న వినాయకుడు ఆ మహర్షి కోరికను నెరవేర్చాడు. అగస్త్యుడి కోరిక మేరకు ఆయనకి దర్శనమిచ్చిన చోటునే వెలిశాడు. ఇక్కడి వినాయకుడిని పూజించడం వలన ఆటంకాలు తొలగిపోయి విజయాలు కలుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories