వసంత నాగేశ్వర్ రావు వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్

Submitted by arun on Mon, 09/10/2018 - 14:08
babu

వైసీపీ నాయకుడు వసంత నాగేశ్వర్ రావు ఫోన్ చేసి గుంటుపల్లి పంచాయితీ కార్యదర్శిని బెదిరించిన వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రి దేవినేని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రినే హత్య చేస్తాం అనే ధోరణిలో వసంత నాగేశ్వర రావు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇలాంటి బెదిరింపులను సహించేది లేదని తేల్చిచెప్పారు. బెదిరింపులు, హత్యాయత్నాలు, హత్యల ద్వారా ఏమీ సాధించలేరని అన్నారు. ఫోన్ కాల్ బెదిరింపు వ్యవహారంలో వసంత నాగేశ్వర రావుపై పోలీసు కేసు నమోదైందని టీడీపీ నేతలు చంద్రబాబుకు దృష్టికి తీసుకువచ్చారు. అసెంబ్లీలోనూ ఈ విషయం లేవనెత్తాలని నిర్ణయించారు. 
 

English Title
CM Chandrababu serious on EX-Minister Vasantha Nageswara Rao Phone Call Controversy

MORE FROM AUTHOR

RELATED ARTICLES