పుట్టిన రోజునే చంద్రబాబు నిరాహార దీక్ష

Submitted by arun on Sat, 04/14/2018 - 17:38
babu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 20న పుట్టిన రోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌ అన్యాయం చేస్తే న్యాయం చేస్తుందని బీజేపీతో చేతులు కలిపితే ఆ పార్టీ కూడా ఏపీకి తీరని ద్రోహం చేసిందని చంద్రబాబు విమర్శించారు. 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 20వ తేదీన తన జన్మదినం సందర్భంగా నిరాహార దీక్ష చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా పని చేసినపుడు మంత్రి పదవులు తీసుకోకుండానే సహకరించామన్న ఆయన తానేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదన్నారు. 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ఢిల్లీని శాసించబోయేది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పామని భవిష్యత్‌లోనూ హస్తినలో చక్రం తిప్పుతామన్నారు. 

నమ్మకం ద్రోహం, కేంద్ర పన్నుతున్న కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. గుజరాత్‌ ప్రజలకు మాత్రం రెండు జిల్లాల పరిధిలో డొలేరా సిటీ కావాలి ? తెలుగు ప్రజలకు మాత్రం మంచి రాజధాని వస్తుంటే కడుపు మంట అని చంద్రబాబు మండిపడ్డారు. ముసుగు వీరులను నమ్ముకుంటే మునిగిపోతామని ముసుగును తొలగించే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తమిళనాడు తరహాలో ఏపీలోనూ బీజేపీ రాజకీయాలు చేయాలని భావించిందని అయితే ఇక్కడ కుదరదన్నారు. ఎవరి రాజధాని అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారని ఇది ప్రజా రాజధాని అని స్పష్టం చేశారు. 

English Title
CM Chandrababu Sensational Decision

MORE FROM AUTHOR

RELATED ARTICLES