వ్యూహాత్మకంగా ఇరుక్కుపోయిన బాబు

వ్యూహాత్మకంగా ఇరుక్కుపోయిన బాబు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వ్యూహాత్మక ప్రణాళికలో ఇరుక్కుపోయినట్టే కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు చూస్తుంటే.....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వ్యూహాత్మక ప్రణాళికలో ఇరుక్కుపోయినట్టే కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు చూస్తుంటే.. చంద్రబాబు తన మెదడుకు అందని పరిణామాల్లో చిక్కుకున్నట్టుగా అర్థమవుతోంది. ఒకప్పుడు బీజేపీతో సంబంధం పెట్టుకుని.. తర్వాత తెగదెంపులు చేసుకుని.. 2014లో మరోసారి జట్టు కట్టి ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు.. తర్వాత ఆ పార్టీతో ఇబ్బంది పడడం మొదలైంది.

ప్రత్యేక హోదా విషయంలో ముందు విపరీతంగా పట్టుబట్టి.. తర్వాత కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీకి సరే.. అన్నప్పుడే.. చంద్రబాబు ఘోరమైన తప్పిదం చేశారు. ప్యాకేజీ ఇస్తామని అన్నపుడే.. కేంద్రం నుంచి బయటికి వస్తే బాగుండేదని స్వయంగా చంద్రబాబే అన్నట్టుగా వార్తలు వచ్చాయంటే.. అప్పుడు ఆయన తప్పు చేసినట్టు పరోక్షంగా ఒప్పుకున్నట్టే లెక్క. అలాంటి చంద్రబాబు.. ఇప్పుడు తెలిసో తెలియకో మరో తప్పు చేస్తున్నారని ప్రత్యర్థి నేతలంటున్నారు.

హోదా ఉద్యమానికి నాయకత్వం వహిస్తా.. అందరూ నాతో కలిసి రండి… మద్దతు కూడగడతా.. అంటూ పార్టీలను పిలుస్తున్నారు. దీనిపై.. సహజంగానే ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. నాడు హోదాకు మోకాలడ్డి.. ఇప్పుడు హోదా ఉద్యమం చేస్తామంటే ఎలా నమ్మాలంటూ.. బాబు తీరును జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాన్ని వైసీపీ అధినేత జగన్ విస్తృతం చేస్తున్నారు.

దీంతో.. చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. హోదా గురించి మాట్లాడితే.. ప్రత్యర్థులు తప్పుబడుతున్నారు. మాట్లాడకుంటే.. జనాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో.. ఆయన.. ప్రత్యర్థి రాజకీయ వ్యూహంలో.. పూర్తిగా ఇరుక్కుపోయినట్టుగానే కనిపిస్తోందని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories