వస్తా.. లెక్కలు తేలుస్తా..

Submitted by arun on Thu, 06/14/2018 - 11:14
modi vs babu

నీతి ఆయోగ్ సమావేశం వేదికగా.. కేంద్రాన్ని నిలదీయాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయ్యింది. కేంద్ర నిధుల కేటాయింపులో.. రాష్ట్రాలకు జరుగుతున్న నష్టాన్ని లెక్కలతో సహా వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా అంశాలతో పాటు కేంద్రసాయంపై.. సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని చంద్రబాబు సర్కార్ ఫిక్స్ అయ్యింది. 
ఈ నెల 17న జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో.. రాష్ట్రాలకు కేంద్రనిధుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని డిసైడ్ అయ్యారు. కేంద్రం వైఖరితో రాష్ట్రాలు ఎలా నష్టపోతున్నాయో.. లెక్కలతో సహా వివరించేందుకు సర్కార్ సన్నద్ధమవుతోంది. 

నీతి ఆయోగ్ సమావేశంలో.. రాష్ట్రానికి సంబంధించి చర్చించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభజన హామీల అమలు, రాష్ట్రంలో చేపట్టిన కేంద్ర ప్రాజెక్టులు, పథకాలకు అందుతున్న నిధులకు సంబంధించి.. సమగ్ర వివరాలతో రిపోర్ట్ రెడీ చేయాలని బాబు ఆదేశించారు. 

రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలను.. కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తుండటంపై.. ఏపీ అభ్యంతరం తెలపనుంది. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రమే భారం మోపుతున్నందున.. ఎక్సైజ్ సుంకాలను తగ్గించుకోవాలని సూచించనుంది. అంతేగానీ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే నిర్ణయాలు తీసుకోవద్దని కోరనుంది.

ఇదిలా ఉంటే.. 16న రంజాన్ పండుగ ఉన్నందున 17 నిర్వహించే నీతిఆయోగ్ సమావేశాన్ని 18వ తేదీకి వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్‌కు లేఖ రాశారు. 17న ఈద్ మిలాప్‌కు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను అమరావతిలో ఉండాల్సి వస్తుందన్నారు. అందువల్ల 18కి గానీ.. 17వ తేదీ.. మధ్యాహ్నానికి గానీ.. నీతిఆయోగ్ సమావేశం వాయిదా వేయాలని బాబు లేఖలో కోరారు.

English Title
CM Chandrababu Naidu urges Niti Aayog to postpone

MORE FROM AUTHOR

RELATED ARTICLES