3లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు

Submitted by arun on Thu, 07/05/2018 - 17:11

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి మూడు లక్షల మంది పేదలు తమ సొంత ఇళ్లలోకి గృహప్రవేశాలు జరిపే మహోన్నత కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో ఒకేసారి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన గృహ నిర్మాణశాఖ అంతకు రెండు రెట్లు ఎక్కువగా మూడు లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేపట్టింది. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద  రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు జరిగాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. రాష్ట్రవ్యాప్తంగా 174 నియోజకవర్గాల్లో ఒకేసారి లబ్ధిదారులు కొత్త ఇళ్లలో అడుగుపెట్టారు. నెల్లూరు, కాకినాడ, విజయవాడలతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో గృహప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభంగా జరిగింది. 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలవారీగా లబ్ధిదారులతో చంద్రబాబు నేరుగా మాట్లాడారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని నిరుపేదల సొంత ఇంటి కల సాకారం అవుతున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార, పౌరసంబంధాలశాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ఇళ్ల మంజూరు విషయంలో ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని, పాత లెక్కలను చూపిస్తూ.. ఇళ్లను మంజూరు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది మార్చిలోపు 19 లక్షల ఇళ్లను నిర్మిస్తామని టార్గెట్ పెట్టుకున్న ఏపీ సర్కార్  2018 అక్టోబర్ 2వ తేదీన నాటికి మరో 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 

English Title
CM Chandrababu Naidu Speech At NTR House Scheme Launch

MORE FROM AUTHOR

RELATED ARTICLES