పవన్ చామ్లింగ్ రికార్డు బ్రేక్ చేస్తారా?

పవన్ చామ్లింగ్ రికార్డు బ్రేక్ చేస్తారా?
x
Highlights

భిన్నజాతులు, మతాల ప్రజలతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్ లో రాజకీయాలు ఎంతో విలక్షణంగా కనిపిస్తాయి. వివాదాలకు, అవినీతికి అతీతంగా ఉంటూ...

భిన్నజాతులు, మతాల ప్రజలతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్ లో రాజకీయాలు ఎంతో విలక్షణంగా కనిపిస్తాయి. వివాదాలకు, అవినీతికి అతీతంగా ఉంటూ జనరంజకపాలన అందించే ముఖ్యమంత్రులు మనకు చాలాతక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఐదేళ్లు కాదు పదేళ్లు కాదు ఏకంగా రెండుదశాబ్దాలపాటు ముఖ్యమంత్రులుగా పనిచేసిన మహాముఖ్యమంత్రుల పై ప్రత్యేక కథనం

మనదేశంలో ప్రస్తుతం ఏడుదశలుగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు వివిధ రాజకీయపార్టీలు, అధినేతల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అధికారం అందుతుందో?...చేజారిపోతుందో? తెలియని పరిస్థితితో కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలే ప్రస్తుత భారత రాజకీయాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అధికారం ఐదేళ్ల ముచ్చటగా మిగిలిపోతుందేమోనని భయపడిపోతున్నారు.

అయితే భారత , ప్రపంచ రాజకీయ చరిత్రను చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవుతూ..దశాబ్దాల తరబడి ముఖ్యమంత్రులుగా, ప్రధానులుగా,దేశాధ్యక్షులుగా ఉన్నవారు ఎందరో మనకు కనిపిస్తారు. భారతగడ్డపై సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనతను సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ దక్కించుకొన్నారు. వివాదాలకు అతీతంగా అవినీతి ఆరోపణలు లేకుండా 24 సంవత్సరాలపాటు సిక్కిం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. అంతేకాదు...ప్రస్తుత 2019 ఎన్నికల బరిలో సైతం పవన్ చామ్లింగ్. మరోసారి నిలిచారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ చామ్లింగ్ విజేతగా నిలిస్తే 29 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

పవన్ చామ్లింగ్ తర్వాత అత్యధికంగా జ్యోతిబసు 23 ఏళ్లపాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. బెంగాల్ చరిత్రలోనే రెండుదశాబ్దాలపాటు రాజకీయాలను శాసించిన నేతగా నిలిచారు. నజరంజక నేతగా నిలిచిపోయారు. 1977 నుంచి 2000 వరకూ బెంగాల్ గడ్డపై జ్యోతిబసు హవా ఆ తర్వాత అత్యధికకాలం 19 ఏళ్లపాటు ముఖ్యమంత్రులుగా కొనసాగిన వారిలో అరుణాచల్ మాజీసీఎం గెగాంగ్ అపాంగ్, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నారు. అరుణాచల్ ముఖ్యమంత్రిగా గెగాంగ్ అపాంగ్ 1980 నుంచి 1999 వరకూ పాలన అందించారు.త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ సైతం 19 ఏళ్లపాటు అధికారంలో కొనసాగారు.1998 నుంచి 2018 వరకూ మాణిక్.. సర్కార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు.ఒడిషా ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం ఇప్పటికే 19 సంవత్సరాలపాటు అధికారంలో కొనసాగారు. ప్రస్తుత ఎన్నికల్లో సైతం అధికారం నిలుపుకోగలిగితే 24 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు అందుకోగలుగుతారు.

ఇక..అత్యధికకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళగా షీలా దీక్షిత్ రికార్డు నెలకొల్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె ఏకబిగిన 15 సంవత్సరాలపాటు పాలన అందించారు.భారత రాజకీయాలకే కేంద్రబిందువు లాంటి ప్రధాని పదవిలో 17 సంవత్సరాలపాటు కొనసాగిన అరుదైన గౌరవం పండిట్ జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది. భారత మొట్టమొదటి ప్రధానిగా 1947 నుంచి 1964 వరకూ నెహ్రూ పాలన అందించారు. ప్రపంచ చరిత్రలో అత్యధికకాలం ఓ దేశాధినేత గా కొనసాగిన రికార్డు ఈక్విటోరియల్ గినియా అధ్యక్షుడు ఎంబసోగాకే దక్కుతుంది. ఎంబసోగా 39 ఏళ్లపాటు దేశాధ్యక్షుడిగా ఎన్నికవుతూ చరిత్ర సృష్టించారు.ఆ తర్వాతి స్థానంలో ఆఫ్రికాఖండ దేశం కామెరూన్ అధ్యక్షుడు బియా నిలిచారు. 36 ఏళ్లపాటు కామెరూన్ అధ్యక్షుడిగా బియా సేవలు అందించారు. ఆసియా దేశాలలో కాంబోడియా అధ్యక్షుడిగా హున్ సెన్ 34 ఏళ్లపాటు అధికారంలో కొనసాగారు. సుదీర్ఘకాలం పాలకులుగా ఉన్న ఈ నేతలంతా జనరంజకపాలనతో అధికారంలో కొనసాగిన వారే. ఐదేళ్లపాటు అధికారంలో నిలవటమే కష్టంగా ఉన్న నేటిరాజకీయాలలో మూడున్నర దశాబ్దాలపాటు అధికారం చెలాయించిన నేతలున్నారంటే ఆశ్చర్యమే మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories