ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయి

Submitted by arun on Sat, 10/27/2018 - 17:34

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా గర్జించారు. ప్రధాని మోడీతోపాటు బీజేపీపై నిప్పులు చెరిగారు. విభజన హామీలు నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌... జాతీయ నేతలకు వివరించిన చంద్రబాబు ప్రధాని మోడీ విధానాలను ఎండగట్టారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న చంద్రబాబు అన్ని వ్యవస్థలను కేంద్రం బలహీనపరుస్తోందని ఆరోపించారు. నల్లధనం వెనక్కి తెస్తానన్నారు ఏమైందని ప్రశ్నించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో వృద్ధిరేటు ఆగిపోయిందన్న చంద్రబాబు దేశంలో బ్యాంకులన్నీ దివాలా తీసే పరిస్థితి వచ్చిందన్నారు.

ఇక విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనను వివరించిన చంద్రబాబు... కేంద్రం పరిధిలో ఉండే విమానాశ్రయంలో దాడి జరిగితే ఏపీ ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం ఆపరేషన్‌ గరుడ చేపట్టిందనే ప్రచారం జరుగుతోందని, అందులో భాగంగానే ఏపీలో ఐటీ రైడ్స్‌ ఇప్పుడు జగన్‌పై దాడి జరిగిందనే అనుమానం కలుగుతోందన్నారు. ఢిల్లీ వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌పై మోడీ కక్ష గట్టారని మండిపడ్డారు. కుట్రలు చేస్తూ టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని చూస్తున్నారని ఆరోపించారు.

English Title
CM Chandrababu Naidu Criticizes Central Government

MORE FROM AUTHOR

RELATED ARTICLES