కేశినేనికి షాక్.. గల్లాకు చాన్స్..!

Submitted by arun on Thu, 07/19/2018 - 16:37
galla

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ ఎంపీలు పట్టుబట్టడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం నాడు ఓకే చెప్పారు. దీంతో మద్దతు కోసం అటు ఎన్డీఏ.. ఇటు టీడీపీ.. పార్టీల అధినేతలు, ఎంపీలను ఒప్పించి మద్దతు కూడగట్టు పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు పార్లమెంట్‌లో ఎవరితో మాట్లాడించాలి..? ఎవరైతే అందుకు సూటబుల్? అనే విషయాలపై సీఎం చంద్రబాబు ఓ ప్రణాళికను తయారు చేశారు. పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చను ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రారంభించనున్నారు. బుధవారం నాడు ఎంపీ కేశినేని నాని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆయన బదులు గల్లా మాట్లాడాలని టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకు గల్లా జయదేవ్‌ మొదలు పెట్టనున్నారు. గల్లా జయదేవ్‌తో పాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు విభజన సమస్యలపై మాట్లాడనున్నారు. వీరిద్దరే కాకుండా సమయాన్ని బట్టి టీడీపీ పార్లమెంటరీ నేత తోట నర్సింహం మాట్లాడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేశినేని మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు. కేటాయించిన సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

English Title
cm-chandrababu-gives-shock-mp-kesineni-nani

MORE FROM AUTHOR

RELATED ARTICLES