ఓహో బాబు ప్లాన్ ఇదేనా

Submitted by arun on Thu, 03/22/2018 - 12:45

చంద్రబాబుపై రాజకీయంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందా? పార్టీలన్నీ కలిపి... ముప్పేట దాడికి దిగుతున్నాయా? తనపైనా, తన కుమారుడిపైనా, తన మంత్రులపైనా రాజకీయ దాడి జరిగే అవకాశం ఉందన్న చంద్రబాబు మాటల వెనుక ఉన్న అసలు మర్మమమేమిటి? ఏపీ సీఎం ఎందుకీ మాట అన్నారు? రాజకీయ వ్యూహంలో భాగమా? ప్రతిపక్షాలను దెబ్బతీసే ఆలోచనా? ప్రజల్లో సానుభూతి పొందే ఉపాయమా? 

 రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీ పడే ప్రసక్తే లేదంటారు.. రాజకీయంగా దెబ్బ తీసే కుట్రను ఎదుర్కొంటానంటారు..తనను, లోకేష్‌ను రాజకీయంగా దెబ్బకొట్టే వ్యూహమంటారు. ఇవీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలు. స్టేట్‌లో స్టేటస్‌ సెగలు రగులుతుంటే అవిశ్వాస తీర్మానం సెగలు కేంద్రంలో అంటుకుంటుంటే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనానికి కేంద్రమయ్యాయి. ఏపీలో మూడు పార్టీలు తనపై ముప్పేట దాడి చేస్తున్నాయని, అయినా ప్రజల కోసం తన పోరాటం ఆగదంటూ మాట్లాడారు. 

పార్లమెంట్‌లో కావాలనే వాయిదాల పర్వం కొనసాగుతుందన్న బాబు ఏపీని ఇబ్బంది పెట్టే వ్యూహంలో ఇదంతా అంటూ మాట్లాడారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజల్లో పూర్తి అవగాహన ఉందన్నారాయన. తొలి ఏడాది నుంచే గొడవలు పెట్టుకుంటే రాష్ట్రం దెబ్బతింటుందనే ఇన్నాళ్లూ ఎదురు చూశామన్న బాబు రాష్ట్రానికి నిధులివ్వాలని కోరితే తనపై కేంద్రం ఎదురుదాడి చేయిస్తోందని టెలి కాన్ఫరెన్స్‌లో ఆవేదన చెందారు. 

తనను, లోకేశ్‌ను, మంత్రులను, టీడీపీని టార్గెట్ చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలు ఇంకా పెరుగుతాయేమోనన్నారు చంద్రబాబు. అన్నింటికీ అందరూ సిధ్ధంగా ఉండాలని ప్రజలను చైతన్యపరచాలని నేతలకు సూచించారు. మూడు పార్టీల పెడధోరణి పరాకాష్టకు చేరిందని తన ఇమేజీ దెబ్బతీయడమే కాక టీడీపీపై బురద జల్లే ప్రయత్నంతో ముందుకు సాగుతున్నాయన్నారు. మూడు పార్టీల మహా కుట్రపై రాష్ట్రంలో చర్చ జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలకు ఎవరి వైఖరి వారికి ఉంటుందన్న చంద్రబాబు తమకు ఏ పార్టీతో శత్రుత్వం లేదని రాష్ట్రానికి న్యాయం జరిగేలా సహకరించాలనే అడుగుతున్నామన్నారు. 

English Title
CM Chandrababu Fires On BJP , YCP, Janasena

MORE FROM AUTHOR

RELATED ARTICLES