ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 07/06/2018 - 10:57
babu

ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌కి ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధమేనన్న చంద్రబాబు అసెంబ్లీకి మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని తేల్చిచెప్పారు. మంత్రివర్గ విస్తరణపైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మైనారిటీల సభ కంటే ముందుగా ఆ వర్గంలో ఒకరికి కేబినెట్‌లో స్థానం కల్పించనున్నట్లు తెలిపారు.

ముందస్తు ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ  ఏపీ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో కేంద్రం ఉందన్న బాబు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే జమిలి ఎన్నికలపైనా కేంద్రం ఆలోచిస్తోందన్న చంద్రబాబు ఏపీలో మాత్రం అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌కి ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధమేనన్నచంద్రబాబు అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు మాత్రం అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఒకవేళ కేంద్రం అడిగితే షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేయనున్నట్లు తెలిపారు. రాజ్యాంగపరంగా ఇబ్బందులుంటే ఎదుర్కొందామని, అవసరమైతే న్యాయ నిపుణులతో మాట్లాడదామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇక మంత్రివర్గ విస్తరణపైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లోకి ముస్లిం మైనారిటీని తీసుకోవడంపై ముఖ్యనేతలతో చర్చించిన బాబు మొదట్నుంచీ టీడీపీలో ఉన్న వ్యక్తికే అవకాశమివ్వనున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన ముస్లిం నేతలను కేబినెట్‌లోకి తీసుకుంటే చిక్కులొస్తాయంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు ముస్లిం మైనారిటీల సభ కంటే ముందే కేబినెట్‌ విస్తరణ చేపట్టనున్నట్లు సంకేతాలిచ్చారు.

English Title
CM Chandrababu Discuses Early Elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES