తెలంగాణ యువకుడి గల్ఫ్ గోస..ఉద్యోగమని చెప్పి...

తెలంగాణ యువకుడి గల్ఫ్ గోస..ఉద్యోగమని చెప్పి...
x
Highlights

ఏజెంట్ల మోసానికి మరో తెలంగాణ యువకుడు బలి అయ్యాడు. ఏడారి దేశంలో చిక్కుకుని కష్టాలు పడుతున్నాడు. రక్షించమంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఓ...

ఏజెంట్ల మోసానికి మరో తెలంగాణ యువకుడు బలి అయ్యాడు. ఏడారి దేశంలో చిక్కుకుని కష్టాలు పడుతున్నాడు. రక్షించమంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఓ వీడియోలో సందేశంలో వేడుకొన్నాడు. బాధితుడి ఘోసపై కేటీఆర్ స్పందించారు. ఇండియా రప్పించడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ ఫోటోలోని యువకుడి పేరు సమీర్‌. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన ఇతడికి గల్ఫ్ లోని ఓ ఫంక్షన్ హాల్లో పని ఇప్పిస్తానని నిజామాబాద్‌కు చెందిన ఏజెంటు ఆశ చూపించాడు. గత నెల 17న 83 వేలు తీసుకుని సమీర్‌ను సౌదీకి పంపించాడు. గల్ఫ్ లో ఫంక్షన్ హాల్లో ఉద్యోగానికి వచ్చిన సమీర్ ను యాజమాని గొర్రెల కాపరిగా పెట్టుకున్నాడు. సరియైన తిండి పెట్టకుండా చిత్ర హింసలు పెడుతున్నాడు. ఇండియాకు తిరిగివెళ్లిపోతానంటే చితకబాదుతున్నాడు.

ఎడారి దేశంలో చిత్ర హింసలపై దిక్కు తోచని సమీర్ తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అలాగే టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వీడియో ద్వారా సందేశం పంపించాడు. ఎలాగైనా రక్షించమంటూ వేడుకున్నాడు. సమీర్ పడుతున్న కష్టాలపై కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందారు. అతడికి స్వదేశం తిరిగి రమ్మని 50 వేలు పంపించారు. కానీ గల్ఫ్ లోని యాజమాని మాత్రం సమీర్ ను పంపించడంలేదు. కేటీఆరే తమ కూమారుడ్ని కాపాడాలని కోరుతున్నారు.

సమీర్ వీడియో సందేశంపై వెంటనే కేటీఆర్ స్పందించారు. సమీర్‌ను ఇండియా రప్పించడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే సౌదీ అరేబియాలో ఉన్న ఇండియన్ ఎంబసీకి ట్వీట్ చేసి సమీర్‌ను ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories