రాజ‌మౌళి చిత్రంలో చ‌రణ్‌, ఎన్టీఆర్ పాత్ర‌లివే..!

Submitted by arun on Fri, 06/01/2018 - 15:14
rrr

తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.  అయితే జక్కన్న ఎక్కవగా ఎన్టీఆర్ తో చిత్రాలు తీశారు.  దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిందే ఎన్టీఆర్ తో అని  చెప్పొచ్చు. ‘స్టూడెంట్ నెం.1’ ఎన్టీఆర్, రాజమౌళికి మొదటి చిత్రం.  ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన రెండవ చిత్రం ‘మగధీర’మరో అద్భుతమైన విజయం సాధించారు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందనుంది.  ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. చిత్ర బృందం ముగ్గురి కలయికను స్ఫురించేలా ఆర్.ఆర్.ఆర్ అనే మూడు ఇంగ్లీష్ అక్షరాల లోగోతో కూడిన వీడియోను విడుదల చేసి అభిమానుల‌లో అంచ‌నాలు పెంచింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సబ్జెక్ట్ గురించి ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక్కరోజు వ్యవధిలో జరిగే సంఘటనల సమాహారంగా ఈ చిత్ర కథాంశం వుంటుందని చెబుతున్నారు.

ప్రథమార్థంలో రామ్‌చరణ్, ద్వితీయార్థంలో ఎన్టీఆర్ పాత్రలు కీలకంగా ఉంటాయని అంటున్నారు. అనూహ్య మలుపులతో ఉత్కంఠభరితంగా సాగే ఇతివృత్తమిదని సమాచారం. ఇక చిత్రంలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండ‌గా, ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడనేది తాజా స‌మాచారం. ఇద్దరు అన్న‌ద‌మ్ములైన‌ప్ప‌టికి వారు ఎంచుకున్న మార్గాలు వేరే కావ‌డంతో కొన్ని అనూహ్య పరిమాణాలు చేసుకోనున్నాయి. ఈ నేప‌థ్యంలో దాదాపు 250కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వనిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

English Title
clarity on rrr movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES