ఆ ఎంపీ సీటుపై జోరుగా బెట్టింగ్..వందకు వెయ్యి, 10వేలకు లక్ష అంటూ బెట్టింగ్

ఆ ఎంపీ సీటుపై జోరుగా బెట్టింగ్..వందకు వెయ్యి, 10వేలకు లక్ష అంటూ బెట్టింగ్
x
Highlights

వందకు వెయ్యి 10వేలకు లక్ష ఇది క్రికెట్ బెట్టింగ్ కాదు కరీంగనర్‌లో కొనసాగుతున్న పొలిటికల్ బెట్టింగ్. ఎంపీ సీటుపై అన్ని పార్టీల్లోనూ టెన్షన్ ఉండటంతో...

వందకు వెయ్యి 10వేలకు లక్ష ఇది క్రికెట్ బెట్టింగ్ కాదు కరీంగనర్‌లో కొనసాగుతున్న పొలిటికల్ బెట్టింగ్. ఎంపీ సీటుపై అన్ని పార్టీల్లోనూ టెన్షన్ ఉండటంతో ఇప్పుడు జోరుగా బెట్టింగ్ సాగుతోంది.

కరీంనగర్ ఎంపీ సీటుపై బెట్టింగ్ రాయుళ్లు పందాలు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ సమయంలో జరిగిన బెట్టింగ్ కంటే ప్రస్తుతం పార్టమెంట్ ఎన్నికల ఫలితాల్లో జరుగుతున్న బెట్టింగ్ మరింత జోరుగా సాగుతోంది. కరీంనగర్‌ ఎంపీ సీటుకు ఎన్నికలు పోటీపోటీగా జరిగాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ఈ పరిస్థితులను బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.

కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకుడు వినోద్ పోటీ చేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్‌ భారీ మెజార్టీతో గెలవాలని ఎన్నికల సమయంలో ముమ్మర ప్రచారం చేశారు. మరోవైపు బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిన బండి సంజయ్ పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పోటీలో ఉన్నారు ఈ ముగ్గురు ఆయా పార్టీలు లో కీలకమైన నేతలు. సిట్టింగ్ ఎంపీ వినోద్ కు తిరుగులేదని టీఆర్ఎస్ భావించినా బీజేపీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది దీంతో ఎవరు గెలుస్తారు అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఎంతటి పోటీ ఇస్తున్నారు అనే అంశంపై కూడా బెట్టింగ్ కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ లో జరిగిన బెట్టింగ్ లానే ఇప్పుడు కూడా హై రేంజ్‌లో బెట్టింగ్ కొనసాగుతోంది. 5 నుంచి 10 లక్షల దాకా బెట్టింగ్ జరుగుతోంది. ఫలితాలపై రౌండ్ రౌండ్ పై కూడా బెట్టింగ్ జరుగుతునట్లు సమాచారం. ఏ రౌండ్ లో ఏ అభ్యర్థికి మెజారిటీ వస్తుంది అనే అంశంపై బెట్టింగ్ జరుగుతోంది. ఓవరాల్ గా జిల్లాలో కోట్లలో బెట్టింగ్ జరుగుతునట్లు సమాచారం. ఇక హైదరాబాద్ కేంద్రంగా కొందరు బెట్టింగ్ రాయుళ్లు ఇతర పార్లమెంట్ సెగ్మెంట్ల పై కూడా బెట్టింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో ఎక్కువ మంది బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు ఇటీవల జరిగి ఐపీఎల్ సీజన్లోనూ బెట్టింగ్‌లో పాల్గొని చాలామంది చేతులు కాల్చుకున్నారు. పోలీసులు దీనిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories