ఎన్నికల ఎఫెక్ట్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ చార్జీలు చూస్తే..

ఎన్నికల ఎఫెక్ట్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ చార్జీలు చూస్తే..
x
Highlights

సార్వత్రిక ఎన్నికల దృశ్య సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరిగింది. సొంత ఊళ్లలో తమ ఓటుహక్కు వినియోగించుకుందుకు హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు...

సార్వత్రిక ఎన్నికల దృశ్య సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరిగింది. సొంత ఊళ్లలో తమ ఓటుహక్కు వినియోగించుకుందుకు హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు తరలిపోతున్నారు కొందరు ప్రజలు. దీంతో ఎంజీబీఎస్ సహా జేబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు మంగళ, బుధ వారాల్లో ఫుల్‌ అయిపోయాయి. దాంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇదే దొరికిందే సందు అనుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల వద్ద భారీగా టిక్కెట్ ధరలు వసూలు చేస్తున్నాయి. సాధారణ టిక్కెట్ పైన రూ.200 నుంచి 250 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. అలాగే హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఏసీ సర్వీస్‌ టికెట్ల రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

తిరుపతి- 2,200

కడప- 1,900

నెల్లూరు- రూ. 3,000 నుంచి 3,500

గుంటూరు- రూ. 2,200

విజయవాడ- రూ. 2,500

కాకినాడ- రూ. 2,000

విశాఖ- రూ.3,200

Show Full Article
Print Article
Next Story
More Stories