పిల్లల దగ్గర ఈ విషయాలు ప్రస్తావించవద్దు

పిల్లల దగ్గర ఈ విషయాలు ప్రస్తావించవద్దు
x
Highlights

పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి ఆలోచనలో కూడా తేడా వస్తుంది. వారికంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటారు. వారు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగివుంటారు...

పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి ఆలోచనలో కూడా తేడా వస్తుంది. వారికంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటారు. వారు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగివుంటారు అనేది ఇంట్లో ఉండే వాతావరణం మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యనగన్.. వారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు అనే దానికి తల్లిదండ్రులు తరచూ ఎలాంటి సందర్భాలు ఎదుర్కొంటారో అవే అంశాలు వారిపై ప్రభావం చూపుతాయి. అయితే వారు మంచి దృక్పథంతో కలిగి ఉండాలి అంటే ..

ముఖ్యంగా 7నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉండే ప్రతికూల అంశాల ప్రభావం వారిపై ఉండకుండా చూసుకోవాలి. నెగెటివ్ ఇంపాక్ట్ పెరుగకుండా జాగ్రత్తపడాలి.

పేరెంట్స్ మధ్య ఎలాంటి గొడవలు ఉన్న వాటిని పిల్లల ముందు బయట పెట్టకూడదు....ఇంట్లో ప్రశాంత వాతావరణం అలవర్చాలి. తల్లిదండ్రులు మాటలు పిల్లలు విననప్పుడు ఆగ్రహానికి లోనై వారిని కొట్టడమో లేదా మాట్లాడాకుండా దూరం పెట్టడమో చేస్తుంటారు. ఇది వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.. అది వారి మానసిక పరిస్థితి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడే వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతారు.

పిల్లలు తినేటప్పుడు వారు పొరపాట్ల ప్రస్తావనను తీసుకరాకూడదు. దాని వాళ్ళ వారు తిండి మానేసే అవకాశం ఉంటుంది, ఇది వారి ఆరోగ్యంఫై... ప్రభావం చూపుతుంది. పిల్లలను తిట్టేటప్పుడు వాళ్లు నిరాశాభావంలోకి వెళ్లిపోతారు. వాళ్లను ఎప్పుడూ తక్కువగా అంచనా వేస్తూ, ఎందుకూ పనికి రావని తిట్టకూడదు. ఇలా చేయడం వల్ల తామెందుకూ పనికిరామనే భావనలోనే వారు ఉంటారు.

ఇతర పిల్లలతో మీ పిల్లలను పోల్చకూడదు. ఇది వారిలో ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. కావున వాళ్ళను తిట్టడం కాకుండా ఒక పని గురించి ప్రయోజనాలు, దుష్పరిణామాలు వెల్లడించాలి. ఇలా తరుచు వారికి వివరించగలిగితే వారు తప్పు చేయకుండా ఉంటారు.

కొంత మంది పేరెంట్స్ వారికున్నభావనను బలంగా పిల్లల్లో నాటుతారు. తల్లిదండ్రులు అలాంటి పొరపాటు చేయకూడదు పిల్లల ఆలోచన విధానాన్ని బట్టి వారు ఉంటారు. మీ వ్యక్తిత్వాన్ని వారిపై..రుద్దకూడదు. మీకు కూతురు ఉన్న కొడుకున్నా వారి విషయంలో జెండర్ భేదాన్ని చూపకూడదు. ఇద్దరూ సమానమేనని వివరించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories