కరీంనగర్ కాంగ్రెస్ నేతలకు పొన్నం ప్రభాకర్ షరతు..

కరీంనగర్ కాంగ్రెస్ నేతలకు పొన్నం ప్రభాకర్ షరతు..
x
Highlights

తెలంగాణలో పరిషత్ ఎన్నికలు ముంచుకు రావడంతో అన్ని పార్టీలు తెగ హడావిడి పడుతున్నాయి. అయితే కరీంనగర్ కాంగ్రెస్ ‌నేతలకు మాత్రం కొత్త టెన్షన్ ప్రారంభమైంది....

తెలంగాణలో పరిషత్ ఎన్నికలు ముంచుకు రావడంతో అన్ని పార్టీలు తెగ హడావిడి పడుతున్నాయి. అయితే కరీంనగర్ కాంగ్రెస్ ‌నేతలకు మాత్రం కొత్త టెన్షన్ ప్రారంభమైంది. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ పెట్టిన షరతే ఇందుకు కారణం. ఇంతకీ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కరీంనగర్ కాంగ్రెస్ నేతలకు పొన్నం ప్రభాకర్ పెట్టిన షరతేంటి..?

ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ చేస్తున్న నేతలకు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ పెట్టిన తాజా షరతు ఇది. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేయాలనుకునే నేతలు..ఒక చేత్తో బీ ఫాం తీసుకుని మరో చేత్తో పార్టీ ఫిరాయించను అంటూ అఫిడవిట్ రాసివ్వాలట. నిజానికి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పొన్నం ప్రభాకర్ ఈ అఫిడవిట్ సాంప్రదాయానికి తెరలేపారు. ఎన్నికల్లో గెలిస్తే పార్టీ మారబోనని బీ ఫాం తీసుకున్న సమయంలోనే అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకూ ఇదే కండషన్ అప్లై అవుతుందంటున్నారు పొన్నం. పొన్నం ప్రభాకర్ పెట్టిన కండిషన్ కరీంనగర్ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది.

శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. అలాగే కరీంనగర్ కార్పోరేషన్ పరిదిలో కూడా చాలా మంది కార్పోరేటర్లు అదికార పార్టీలోకి జంప్ అయ్యారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా పొన్నం ప్రభాకర్ బాండ్ పేపర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. కరీంనగర్ కాంగ్రెస్ నేతలకు పొన్నం ప్రభాకర్ సెట్టిన అషిడవిట్ షరతు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అఫిడవిట్ షరతుకి నేతలు పొన్నం ముందు తలూపినా పక్కకు పోయాక మాత్రం ఇదేం షరతురా బాబూ అని చెవులు కొరుక్కుంటున్నారు. పొన్నం నిర్ణయంపై కొందరు హస్తం నేతలు పెదవి విరుస్తున్నారు. ఇది పొన్నం సొంత నిర్ణయమా టీపీసీసీ నిర్ణయమా అని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories